Begin typing your search above and press return to search.
మెగాస్టార్ అతనిపై అంత నమ్మకం పెట్టుకున్నాడా...?
By: Tupaki Desk | 16 Sep 2020 11:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి - మెహర్ రమేష్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ''వేదలమ్'' చిత్రాన్ని వీరు తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. సిస్టర్ సెంటిమెంట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందని చిరు భావించాడట. అయితే చిరంజీవి ఈ ప్రాజెక్ట్ కోసం మెహర్ రమేష్ ని డైరెక్టర్ ఎంచుకోవడం మెగా అభిమానులకు ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే మెహర్ రమేష్ గతంలో 'కంత్రి' 'బిల్లా' 'శక్తి' 'షాడో' వంటి ప్లాప్ సినిమాలు తీశాడు. ఆ తర్వాత ఈ ఏడేళ్లలో మరో సినిమాకి డైరెక్షన్ చేయలేదు. ఈ నేపథ్యంలో మెహర్ తో సినిమా ఉండకపోవచ్చు.. ఇవన్నీ రూమర్స్ అయ్యుండొచ్చు అనుకున్నారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని కంఫర్మ్ చేసేశాడు.
కాగా, మెహర్ రమేష్ ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ మీద మూడేళ్ళ పాటు వర్క్ చేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్స్ కి ఏమి కావాలో అన్ని అంశాలు ఉండేలా ఈ స్క్రిప్ట్ లో తగినన్ని మార్పులు చేశాడట మెహర్. అంతేకాకుండా ఇటీవల మన నేటివిటీకి తగ్గట్లు మార్చిన కంప్లీట్ స్క్రిప్ట్ ని చిరంజీవికి వినిపించి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడని సమాచారం. అయితే ఫైనల్ నేరేషన్ తీసుకున్న చిరు ఈ స్క్రిప్ట్ లో చిన్న చేంజెస్ కూడా చెప్పకుండా సింగిల్ సిట్టింగ్ లో ఒకే చేసాడట. మెహర్ సినిమాలు ప్లాప్ అయినప్పటికీ హీరోలను స్టైలిష్ గా ప్రెజెంట్ చేస్తారనే పేరుంది. ఈ నేపథ్యంలో చిరంజీవిని కూడా నెక్స్ట్ లెవల్ లో చూపించబోతున్నాడట. అందుకే మెహర్ రమేష్ పై చిరు పూర్తి నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి చిరు పెట్టుకున్న నమ్మకాన్ని మెహర్ నిలబెట్టుకుంటాడేమో చూడాలి. ఇక ఈ సినిమాలో కీలమైన చెల్లెలి పాత్ర కోసం హీరోయిన్ సాయి పల్లవిని సంప్రదిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించనున్నారని సమాచారం.