Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ల‌ని మెగాస్టార్ రీ-యూనియ‌న్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   28 July 2022 12:30 AM GMT
సీనియ‌ర్ల‌ని మెగాస్టార్ రీ-యూనియ‌న్ చేస్తున్నారా?
X
మెగాస్టార్ చిరంజీవి మ‌ళ్లీ పాత రోజుల్లోకి వెళ్లిపోతున్నారా? ఆ నాటి స్నేహాలు మ‌ళ్లీ కోరుకుంటున్నారా? త‌న హీరోయిన్ల‌ని మ‌ళ్లీ రీయూనియ‌న్ చేసే ప్లాన్ లో ఉన్నారా? అంటే అవున‌నే ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే  ఆయ‌న క‌థానాయుడిగా న‌టిస్తోన్న `గాడ్ పాద‌ర్` చిత్రం లో ఓ సీనియ‌ర్ హీరోయిన్ తో కీల‌క పాత్ర చేయించాల‌నుకున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆ అవ‌కాశం  వెట‌న‌ర్ న‌టి శోభ‌నికి ద‌క్కింద‌ని ప్ర‌చారం సాగింది. కానీ అది సాధ్య‌ప‌డ‌క‌పోయే స‌రికి న‌య‌న‌తార‌ని రంగంలోకి దించాల్సి వ‌చ్చింది. ప్ర‌స్తుతం బాబి ద‌ర్శ‌క‌త్వంలో `వాల్తేరు వీర‌య్య `లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ర‌వితేజ్ కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. చిరు-ర‌వితేజ స‌వ‌తి సోద‌రులుగా క‌నిపించ‌నున్నార‌ని స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో ర‌వితేజ త‌ల్లి పాత్ర కోసం రాధిక‌..విజ‌య‌శాంతి ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపినా  ఫ‌లించ‌లేదుట‌. చివ‌రికి ఆ పాత్ర‌కి మ‌రో సీనియర్ న‌టి సుమ‌ల‌త‌ని ఒప్పించిన‌ట్లు స‌మాచారం. అలాగే మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో  భోళా శంక‌ర్ సినిమా చేస్తున్నారు. ఇందులో కూడా క్రేజ్ ఉన్న ఓ సీనియ‌ర్ న‌టికి ఛాన్స్ ఉందిట‌. ఈ నేప‌థ్యంలో ఆ పాత్రిక సీనియ‌ర్ నే తీసుకుంటే బాగుంటుంద‌న్న ప్ర‌పోజ‌ల్ ర‌మేష్ వ‌ద్ద ఉంచారుట‌.

ప్ర‌స్తుతం ఈవిష‌యం చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉంద‌ని తెలుస్తోంది. ఈ ప్ర‌చార‌మే గ‌నుక నిజ‌మైతే మెగాస్టార్ సీనియ‌ర్ న‌టీమ‌ణుల్ని అంద‌ర్నీ రీ- యూనియ‌న్ చేస్తున్న‌ట్లే. జ‌య‌ప్ర‌ద..జ‌య‌సుధ‌.. రాధిక‌..సుమ‌ల‌త‌..విజ‌య‌శాంతి..శోభ‌న ..రాధ..ఖుష్బూ వీళ్లంతా 80-90 ద‌శ‌కంలో చిరంజీకి జోడీగా న‌టించిన వారే. అప్ప‌టి చిరంజీవికి వాళ్ల‌తో  మంచి స్నేహం ఉంది.

అప్పుడ‌ప్పుడు గెట్ టూ గెద‌ర్ పార్టీల‌తో వీళ్లంతా ఒకేచోట హాజ‌ర‌వుతుంటారు. హైద‌రాబాద్ కి ఏ ప‌నిమీద వ‌చ్చిన త‌ప్ప‌కుండా చిరంజీవి ఇంటిని విజిట్ చేస్తుంటారు. వారికోసం చిరు ప్రత్యేకంగా లంచ్..డిన్న‌ర్ వంటివి ఏర్పాటు చేయిస్తుంటారు.  చిరంజీవి స‌మ‌కాలీకులు నాగార్సున  సైతం వెట‌ర‌న్ స్టార్స్ ని అలాగే గౌర‌విస్తుంటారు.

పాత త‌రం నటుల‌తో ఇంట‌రాక్ష‌న్ అంటే చిరు-నాగ్ ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. వాళ్లిద్ద‌రిలో గొప్ప క్వాలిటీ ఇది. అయితే ఇలాంటి వాటికి బాల‌కృష్ణ‌..వెంక‌టేష్ దూరంగా ఉంటారు. వీళ్లిద్ద‌రు  కేవ‌లం ఏడాదికి ఒక‌సారిగా జ‌రిగే గెట్ టూ గెద‌ర్ లో మాత్ర‌మే భాగ‌మ‌వుతుంటారు.