Begin typing your search above and press return to search.
ఎవరు చెప్పినా నా పద్ధతి మారదు: మెగాస్టార్
By: Tupaki Desk | 16 April 2020 2:45 AM GMTటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. అతి సామాన్య కుటుంబం నుండి సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి ఎన్నో మైలురాళ్లను, పునాదులను సృష్టించి నేటి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇండస్ట్రీలో ఎందరు స్టార్లు ఉన్నా మెగాస్టార్ మాత్రమే అందరికి ఆరాధ్య దైవం. ఇదివరకే ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రావాలనుకున్నా ప్రతీ ఒక్కరికి మెగాస్టార్ మాత్రమే రోల్ మోడల్, బాస్. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ కష్టంతో అంచెలంచెలుగా ఎదిగి నేడు మెగాస్టార్ అనే పిలుపుకు మరో రూపంగా నిలుస్తున్నాడు. అంతేగాక ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం, ఎల్లప్పుడూ నిర్మాతల శ్రేయస్సు కోరుకోవడం చిరు ప్రత్యేకత. ఆయన గొప్ప మనసు గురించి ఇండస్ట్రలో ఎన్నో గొప్ప కథలు వినిపిస్తుంటాయి.
ముఖ్యంగా మెగాస్టార్ లోని అత్యంత గొప్ప లక్షణం ఒకటుంది. అది ఈ తరం హీరోలు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన లక్షణం. మెగాస్టార్ ఏ సినిమా చేసినా సినిమా పూర్తయ్యాకే పారితోషకం తీసుకుంటారు. ఆయన కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటివరకు అడ్వాన్స్ తీసుకునే అలవాటు లేదు. సినిమా అంతా పూర్తయ్యాకే పారితోషకం గురించి మాట్లాడుతారు. ఈ విషయం గురించి బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్రతో జరిగిన ఒక సందర్భాన్ని గుర్తుచేశారు. పారితోషికం విషయంలో చిరును జితేంద్ర హెచ్చరించాడట. సినిమా పూర్తయ్యాక నిర్మాతలు చేతులెత్తేస్తే పరిస్థితి ఏంటి? అడ్వాన్స్ తీసుకో అన్నాడట. మెగాస్టార్ ఆ మాటలు పక్కన పెట్టి సినిమా పూర్తయ్యాకే పారితోషకం తీసుకుంటానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ లక్షణం తన కొడుకు రామ్ చరణ్ అలవాటు చేసుజున్నాడట. ఈ తరంలో ఇంకెవరైనా అలా చేస్తున్నారో లేదో తనకు తెలియదని మెగాస్టార్ అన్నారు.