Begin typing your search above and press return to search.
నితిన్ కు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్..
By: Tupaki Desk | 30 March 2020 8:30 AM GMTఈ రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలకు అందుబాటులో ఉండటానికి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ట్విట్టర్ ఓపెన్ చేసిన 24గంటల్లోనే అద్భుతమైన ఫాలోయింగ్ ని సొంతం చేసుకొని రోజు జరిగే మంచి పనులకు అభినందనలు తెలుపున్నారు. ఇక ఈ రోజు యంగ్ హీరో పుట్టిన రోజు సందర్భంగా తన అభిమానులకు పుట్టినరోజు వేడుకలు జరుపవద్దని, అది ఎవ్వరికి మంచిది కాదని పిలుపినిచ్చాడు. నితిన్ కూడా అందరూ హీరోల లాగే ముందుకొచ్చి కరోనా గురించి తన వంతు పోరాటం జరుపుతున్నాడు. ఎంతో బాధ్యతతో పుట్టినరోజు వేడుకలు రద్దు చేసి అభిమానుల ఆరోగ్యం గురించి ఆలోచించడంతో సోషల్ మీడియాలో నితిన్ పై అభినందనల వెల్లువ కురుస్తోంది.
ఇక మెగాస్టార్ స్టార్ చిరంజీవి నితిన్ గురించి స్పందిస్తూ.. నితిన్! నీకు నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ పుట్టినరోజు పక్కన పెట్టి అభిమానుల ఆరోగ్యం గురించి నీ ఆలోచన చాలా అభినందనీయం. కరోనా పై అందరి తో పాటు నువ్వు కూడా ఒక పట్టువిడువని సైనికుడిలా పోరాటం సాగిస్తున్నావు. భారత దేశంలో కరోనా మహమ్మారిని తరిమి కొట్టేవరకు కలిసి పోరాడుదాం.. నీకు, నీకు కాబోయే భార్య షాలినికి నా శుభాకాంక్షలు.. అంటూ చిరంజీవి తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చక్కర్లు కొడుతోంది. అభిమాన హీరో నితిన్ కు శుభాకాంక్షలు తెలిపినందుకు ఫ్యాన్స్ లో ఆనందం రెట్టింపయ్యింది.