Begin typing your search above and press return to search.

ఆ లెక్కలను సవరిస్తున్న మెగా బాస్!

By:  Tupaki Desk   |   4 May 2020 8:10 AM GMT
ఆ లెక్కలను సవరిస్తున్న మెగా బాస్!
X
పాత తరం హీరోలకు ఈ తరం హీరోలకు ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే సోషల్ మీడియాలో ఫాలోయింగ్. గతంలో తమ అభిమాన హీరోలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే సంప్రదాయ మీడియాపై ఆధారపడేవారు. ఇప్పుడు సోషల్ మీడియా రాకతో అది పూర్తిగా మారిపోయింది. హీరోలే డైరెక్ట్ గా తమ అభిమానులతో టచ్ లో ఉండేందుకు అవకాశం లభించింది. ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకుని చాలామంది హీరోలు తమ అభిమానుల సంఖ్యను పెంచుకుంటున్నారు. అయితే ఈ రేసులో సీనియర్ స్టార్లు వెనకబడిపోయారనే చెప్పాలి.

నిజానికి ఈ తరం ప్రేక్షకులకు చేరువ కావాలంటే సోషల్ మీడియాలో తప్పని సరిగా ప్రెజెన్స్ ఉండాల్సిందే. ఈ మాట అతిశయోక్తిగా అనిపించవచ్చేమో కానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అమితాబ్ బచ్చన్ లాంటి వారికి 25 ఏళ్ళ వయసు లోపు ఉండే ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. అదే మన స్టార్ హీరోలను తీసుకుంటే ఆ వయసు ప్రేక్షకుల్లో పెద్దగా ఫాలోయింగ్ లేదు అనేది వాస్తవం. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆ లెక్కలను సరిచేసే స్ట్రేటజీతోనే సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారని కొందరు సోషల్ మీడియా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇన్నాళ్లూ మెగాస్టార్ సోషల్ మీడియాకు దూరంగా ఉండడంతో యంగ్ జెనరేషన్ ప్రేక్షకులకు దూరం అయ్యారు. ఈ ప్రేక్షకులను మిగతా హీరోలు ఆకట్టుకోవడంతో వారి ఫ్యాన్స్ గా మారిపోయారు. అంతే కాకుండా మెగా అభిమానుల్లోనే చీలికలు రావడంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్.. అల్లు అర్జున్ అంటూ వేరే కుంప‌ట్లు తయారైన విషయం కూడా చర్చకు వస్తూనే ఉంది. ఈ లెక్కలను సరి చేసి.. ఈతరం ప్రేక్షకులను అందరినీ మెగా గొడుగు కిందకు తీసుకు రావాలంటే సోషల్ మీడియాను సమర్థవంతంగా వాడుకోవాలని డిసైడ్ అయ్యారట.

తన డై హార్డ్ ఫ్యాన్స్ అందరూ 30 ప్లస్ లేదా 40 ప్లస్ వయసు ఉండేవారు కాబట్టి వారి అభిమానం ఎలాగూ కొనసాగుతుందని.. అయితే పాతిక ముప్పై లోపు ఉండేవారిని ఈ తరం టీనేజర్లను పిల్లలను ఆకట్టుకునేలా కథలు తయారు చెయ్యాలని తనను ఎప్రోచ్ అవుతున్న రచయితలకు.. దర్శకులకు మెగాస్టార్ సూచిస్తున్నారట. కొరటాల శివ సినిమా కూడా ఈ కోవలోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని.. మాస్ ప్రేక్షకులను మెప్పించే ఎలిమెంట్స్ కూడా ఉంటాయని అంటున్నారు. మరి మెగాస్టార్ కొత్త స్ట్రేటజీ అర్థం కాని కొందరు చిరు ఊరికే ట్వీట్లు వేస్తున్నారని.. అదే పనిగా యాక్టివ్ గా ఉండడం ఎందుకని విమర్శిస్తున్నారు. అసలు విషయం తెలిస్తే వారు ముక్కున వేసుకుని 'ఔరా మెగాస్టార్' అనకుండా ఉండలేరు!