Begin typing your search above and press return to search.
డిజిటల్ విడుదలకు సిద్ధమైన బాలీవుడ్.. మరి టాలీవుడ్ పరిస్థితి ఏంటి?
By: Tupaki Desk | 14 May 2020 10:10 AM GMTప్రస్తుతం విడుదలకు సిద్దమైన బాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయితే గనక భారీ సినీ అభిమానులను చేరగలుగుతాయి. ఈరోజుల్లో ఆకట్టుకునే కంటెంట్ ఉంటే చాలు.. అవి భారీగా కాసుల వర్షం కురిపిస్తాయి. కరోనా వైరస్ కారణంగా చాలామంది దర్శక నిర్మాతలు థియేట్రికల్ విడుదల గురించి అలోచించకుండా డిజిటల్ విడుదల కోసం రెడీ అవుతున్నారు. ఇదే కోవలో తాజాగా అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖుర్రానా నటించిన గులాబో సీతాబో సినిమాను జూన్ 12న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నారు. అలాగే నవాజుద్దీన్ సిద్దిఖీ "ఘూమ్‌కేటు" మే 22 నుండి జీ5 లో విడుదల కానుంది.
ఇక అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్ హాట్ స్టార్ లో విడుదల అవుతుండగా విడుదల తేదీ మాత్రం తేదీ ఇంకా నిర్ణయించలేదు. ఇక యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ నటించిన షెర్షా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇదే బాటలో విద్యాబాలన్ నటించిన శకుంతల దేవి, కరణ్ జోహార్ యొక్క 'కార్గిల్ గర్ల్'.. గుంజన్ సక్సేనా, జాన్వీ కపూర్, అమితాబ్ బచ్చన్, చెహ్రే నటించిన ఈ సినిమా కూడా డిజిటల్ విడుదల లక్ష్యంగా రాబోతుంది. థియేట్రికల్ విడుదలకు కాకపోతే చిత్రనిర్మాతలు భారీ మొత్తంలో నష్టపోతారు. కాని పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోక తప్పదు. అందుకే తమ సినిమాలను ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట.
అనేక ఊహాగానాలు ఉన్నప్పటికీ.. టాలీవుడ్ నటులు, దర్శకులు ఎవరూ కూడా తమ చిత్రాలను ఓటిటిలో విడుదల చేయడానికి ధైర్యం చేయట్లేదు. ఇక ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి కూడా వెబ్ సిరీస్ లతో ఓటిటి వైపు రానున్న విషయం తెలిసిందే. అయితే అమితాబ్ కూడా ఓటిటిలో తన సినిమాలు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో మెగాస్టార్ కూడా ఓటిటి వైపు అడుగులు వేస్తున్నారు. మరి విడుదలకు సిద్దమైన తెలుగు సినిమాలు కూడా ఓటిటిలో విడుదల అయితే బాగుంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరి మన టాలీవుడ్ హీరోలు కూడా బాలీవుడ్ లాగా బోల్డ్ నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి! అసలే ఇప్పుడు ఓటిటి రిలీజ్ అనేది ట్రెండింగ్ లో ఉంది.