Begin typing your search above and press return to search.
అందుకే మెగాస్టార్ అనేది
By: Tupaki Desk | 21 May 2019 4:47 AM GMTసినిమా విషయంలో మెగాస్టార్ చిరంజీవి నిర్ణయాత్మక శక్తి మీద ఇండస్ట్రీ వర్గాలకు చాలా నమ్మకం. ఆయన ఏదైనా బలంగా నమ్మి ఫలితాన్ని ఊహిస్తే అది ఖచ్చితంగా అలాగే జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కత్తి తెలుగు రీమేక్ ని తన కంబ్యాక్ కోసం ఎంచుకున్నప్పుడు అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళే ఎక్కువ. కాని చిరు దానికే కట్టుబడ్డారు. అద్భుతమైన ఫలితాన్ని అందుకున్నారు. 1992లో తన ఇమేజ్ పీక్స్ లో ఉన్న సమయంలో ఘరానా మొగుడు సినిమాలో హీరొయిన్ నగ్మా చిరుని చెంపదెబ్బ కొట్టే సీన్ ఉంటుంది.
అది పెట్టడం గురించి దర్శకుడు రాఘవేంద్ర రావు తర్జనభర్జన పడుతుంటే హీరోనే స్వయానా ఒప్పించి తీయించారు. ఫలితంగా అదే హై లైట్ అయ్యింది. మొదట ఇది విన్న ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసినా సినిమా చూసిన తర్వాత చల్లబడ్డారు. మెగా జడ్జిమెంట్ కు ఉదాహరణగా దీన్నే చెప్పుకోవచ్చు. అలాంటిదే సైరా విషయంలో కూడా ఒకటి జరిగిందట
సైరాలో నరసింహరెడ్డి అనుచరుడిగా ఓబయ్య పాత్రలో నటిస్తున్న విజయ్ సేతుపతికి కాస్త లెంత్ ఎక్కువ వచ్చిందట. అంతే కాదు కొన్ని సీన్స్ లో చిరునే డామినేట్ చేసినట్టుగా రషెస్ చూసిన యూనిట్ కు అనిపించింది. దీంతో వాటిని తగ్గించాలనే ఉద్దేశంతో చిరు ముందు ప్రతిపాదన పెడితే ఆయన నిర్మొహమాటంగా తిరస్కరించినట్టు తెలిసింది. ఇదే ప్లస్ అవుతుందని తెలుగుతో పాటు తమిళనాడులో దీనికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని చెబుతూ అందుకు నో చెప్పారట.
సో విజయ్ సేతుపతి పాత్రకు ఎలాంటి కత్తిరింపులు ఉండనట్టే. రెండేళ్ళ క్రితం ఖైది నెంబర్ 150 విడుదలకు ముందు తన సీన్ తీశేసారని పృథ్వి వాపోతే అది తెలుసుకున్న చిరు అవసరం లేకున్నా వాటిని పెట్టించారు. అవి మైనస్ కాలేదు. ఇప్పుడు కూడా చిరు డెసిషన్ అలాంటి ఫలితాన్నే ఇస్తుందని సన్నిహితుల మాట.