Begin typing your search above and press return to search.
మెగాస్టార్ టైటిల్ నాలుగోసారి
By: Tupaki Desk | 4 April 2019 2:30 PM GMTఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి పాత టైటిల్స్ ని వాడుకోవడం. ఇప్పటికే నాని గ్యాంగ్ లీడర్ ని తీసుకోవడం పట్ల మెగా ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేయగా అసలది తమదంటూ ఇంకో నిర్మాణ సంస్థ బయటికి రావడం ఆ రచ్చ కొన్ని రోజులు జరిగి తర్వాత చల్లారిపోవడం తెలిసిందే. ఇలా చేయడం మొదటిసారి కాదు కానీ చిరు కెరీర్లో చాలా స్పెషల్ గా ఫీలయ్యే మూవీస్ ని వేరే వాళ్ళు వాడుకోవడం అభిమానులు అంతగా ఇష్టపడరు.
ఈ క్రమంలో మరో యూత్ హీరో చిరు టైటిల్ ను తీసుకోవడంతో మళ్ళి ఇది టాపిక్ గా మారింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ్ రట్ససన్ రీమేక్ కు రాక్షసుడు టైటిల్ ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
ఇది 1986లో వచ్చిన చిరు హిట్ మూవీ పేరు. యండమూరి నవల ఆధారంగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందగా మ్యూజికల్ గా కూడా సూపర్ సక్సెస్ అందుకుంది. తర్వాత ఈ పేరుతో సాయి కుమార్ ఓ సినిమా చేశాడు. అది డిజాస్టర్. సూర్య హీరోగా వచ్చిన హారర్ కామెడీకి ఇదే టైటిల్ వాడుకున్నారు. జనం పెద్దగా ఆదరించలేదు.
ఇప్పుడు బెల్లంకొండ హీరో తీసుకున్నాడు కాబట్టి ఇది నాలుగో సారి అవుతుంది. కథ ప్రకారం ఈ టైటిలే యాప్ట్. కాని అది విలన్ పాత్రను ఉద్దేశించినట్టుగా ఉంటుంది. సీతకు హీరొయిన్ ఓరియెంటెడ్ టైటిల్ కు ఓకే చెప్పిన సాయి శ్రీనివాస్ ఇప్పుడు విలన్ ను ఉద్దేశించి పెట్టిన టైటిల్ కి ఎస్ చెప్పాడు.తన ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పును బయటపెట్టుకున్నాడు. మరి ఈ మెగా టైటిల్ సెంటిమెంట్ బెల్లం హీరోకు హిట్టిస్తుందా వేచి చూడాలి. ప్రూవ్ అయిన సబ్జెక్టు కాబట్టి యూనిట్ అయితే ధీమాగా ఉంది