Begin typing your search above and press return to search.

మెగాస్టార్ టంగ్ స్లిప్పింగ్ మ‌హా ఇబ్బందే!

By:  Tupaki Desk   |   29 Dec 2022 5:30 PM GMT
మెగాస్టార్ టంగ్ స్లిప్పింగ్ మ‌హా ఇబ్బందే!
X
మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమా వేడుక‌కు విచ్చేసినా ఎంతో చ‌క్క‌గా మాట్లాడుతారు. అదే వేదిక‌పై త‌న‌దైన శైలిలో జోకులు వేసి చుట్టూ ఉన్న వాళ్ల‌ని న‌వ్విస్తుంటారు. ఆయ‌న లో కామెడి టైమింగ్ టింజ్ ని అలా అప్పుడ‌ప్పుడు బ‌య‌ట పెడుతుంటారు. ఇటీవ‌లే ఓ సంద‌ర్భంలో ఓ ప్ర‌ముఖ అవ‌ధాని గురించి ప‌రోక్షంగా త‌న‌దైన శైలిలో సెటైర్ వేసి అక్క‌డ‌నున్న వారంద‌న్నీ న‌వ్వించారు.

ఆ వీడియో సోష‌ల మీడియాలో జోరుగా వైర‌ల్ అయింది. ఇది ఆయ‌న లో న‌వ్వించే గుణం. ఇక్క‌డ పెద్ద ఇబ్బందేమి లేదు. అంతా న‌వ్వేసి వెళ్లిపోతారు. కానీ కొన్ని కొన్ని వేదిక‌ల్లో మెగాస్టార్ టంగ్ స్పిప్ అవుతున్నారని అంతే స‌ర‌దాగా కొన్ని ర‌కాల కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి త‌న సినిమా వేడుక‌కు విచ్చేసినా....త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ ఈవెంట్కి వ‌చ్చినా చిరంజీవి ఎక్కువ సేపు మాట్లాడుతారు.

సినిమాకి ప‌ని చేసిన టీమ్ అంద‌రితో పాటు ఇత‌ర విష‌యాలు పంచుకుంటారు. అయితే చిక్కంతా సినిమా విష‌యాల‌తోనే ముడిప‌డి ఉందంటున్నారు. సినిమా గురించి చెప్పే ప్రోస‌స్ లో ఆయ‌నే క‌థ గురించి రివీల్ చేసేయ‌డం..అందులో పాత్రల గురించి లీక్ చేయ‌డం జ‌రుగుతుంది. 'రంగ‌స్థ‌లం'..'ఆచార్య‌'...'సైరా న‌రసింహారెడ్డి' లాంటి సినిమాల‌కు ఇలాగే జ‌రిగింది.

ద‌ర్శ‌కులు రిలీజ్ వ‌ర‌కూ ఎంతో సీక్రెట్ గా ఉంచాల‌నుకున్న విష‌యాలు చిరంజీవి నోటి ద్వారా చాలా సంద‌ర్భాల్లో అనుకోకుండా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాయంటున్నారు. లైన్ చెప్పేసి వ‌దిలేస్తే ప‌ర్వాలేదు కానీ..అంత‌క ముందుకు వెళ్లి పాత్ర‌ల్ని రివీల్ చేయ‌డం సినిమాపై క్యూరియాసిటీని త‌గ్గించేస్తుంద‌ని కొన్ని ర‌కాల విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

చేతిలో మైక్ ఉండే స‌రికి చిరు టంగ్ స్లిప్ అవుతున్నార‌ని ఫిలిం స‌ర్కిల్స్ లో సైతం చ‌ర్చ‌కొస్తుంది. దీనికి ద‌ర్శ‌కులు ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. అక్క‌డ మాట్లాడేది చిరంజీవి కాబ‌ట్టి న‌వ్వుత్తూ వాటిని స్వాగ‌తించ‌డం త‌ప్ప చేసేదేం లేద‌ని తెలుస్తోంది. మ‌రి మెగాస్టార్ ఈ విష‌యాన్ని గ్ర‌హించారో ? లేదో? సంగ‌తి తెలిస్తే మాత్రం చిరు త‌ప్ప‌క చ‌ర్య‌లు తీసుకుంటార‌ని ద‌ర్శ‌కులు మాత్రం కాన్పిడెంట్ గానే ఉన్నారు. అయినా అన్న‌య్య చెబితే త‌ప్పేముందని భావించిన వారు లేక‌పోలేదు. మ‌రి ఈ విష‌యాన్ని చిరు చెవిన వేసేది ఎవ‌రు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.