Begin typing your search above and press return to search.

2022లో మెగాస్టార్ అన్ లిమిటెడ్ ట్రీట్

By:  Tupaki Desk   |   30 Nov 2021 11:30 AM GMT
2022లో మెగాస్టార్ అన్ లిమిటెడ్ ట్రీట్
X
మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌ల బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఒకేసారి నలుగురు ద‌ర్శ‌కుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన చిరు వెంట వెంట‌నే షూటింగుల‌ను ప్రారంభించడం ఆస‌క్తిక‌రం. వ‌రుస షెడ్యూళ్లు చిరుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

కొర‌టాల‌తో ఇప్ప‌టికే `ఆచార్య` షూటింగ్ పూర్తి చేసిన మెగాస్టార్ ప్రస్తుతం గాడ్ ఫాదర్ - భోళా శంకర్ సెట్స్ కి అటూ ఇటూ ష‌టిల్ అవుతున్నారు. బాబీ సినిమా షూటింగ్ కూడా డిసెంబర్ లో ప్రారంభించి ఒక లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేయనున్నారు. కేవలం ఏడాది వ్యవధిలో నాలుగు సినిమాలను విడుదల చేయాలని మెగాస్టార్ ఆసక్తిగా ఉన్నారు. `ఆచార్య` ఫిబ్రవరి 4న విడుదల కానుంది. గాడ్ ఫాదర్ మేకర్స్ ఈ చిత్రాన్ని 2022 వేసవిలో విడుదల చేయాల‌న్న‌ది ప్లాన్. బాబీ చిత్రం మొదట షూటింగ్ పూర్తి చేస్తుంది. ఈ చిత్రం దసరా 2022కి విడుదలయ్యే అవకాశం ఉంది. భోలా శంకర్ 2023 సంక్రాంతికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

విడుదల తేదీలను లాక్ చేసి వీలైనంత త్వరగా ప్రకటించాలని చిరంజీవి ఆసక్తిగా ఉన్నారు. చిరంజీవి ఆచార్య ప్రమోషన్స్ కి వెళ్లేలోపు `గాడ్ ఫాదర్` షూటింగ్ జనవరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. మెగాస్టార్ ఇప్ప‌టికే కొత్త సినిమాలకు సంత‌కాలు చేసేందుకు ఇత‌ర ద‌ర్శ‌కుల‌తో చర్చలు జరుపుతున్నారు. అతను వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక చిత్రానికి సంతకం చేసాడు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్ టైన్మెంట్ ప‌తాకంపై నిర్మించ‌నున్నారు. ప్ర‌తియేటా నాలుగు చిత్రాల్ని విడుద‌ల చేసేందుకు చిరు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఉన్నారు. దానికి త‌గ్గ‌ట్టు ప్ర‌తిదీ వ‌ర్క‌వుట్ చేస్తున్నారు.