Begin typing your search above and press return to search.
మెగాస్టార్ వీరయ్య కాదు మొనగాడు
By: Tupaki Desk | 11 Feb 2022 4:50 AM GMTమెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో యమ జోరు మీదున్నాడు. 1980 మరియు 1990 ల్లో ఆయన ఎలా అయితే ఏడాదిలో అరడజనుకు పైగా సినిమాలు చేసేవాడో ఇప్పుడు అదే ట్రెండ్ ను మళ్లీ తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. సినిమాలు స్పీడ్ గా చేయడం ద్వారా నిర్మాతలకు ఎక్కువ నష్టం ఉండదు అనే అభిప్రాయంతో చిరంజీవి సినిమాలు చేస్తూ ఉంటాడు. తన దర్శకులకు తక్కువ సమయంలో సినిమాలను పూర్తి చేయాలని ఎప్పుడు చెబుతూ ఉండే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాను కేవలం వంద రోజుల్లోనే పూర్తి చేయాలనుకున్నాడు.
అందుకు కొరటాల శివ కూడా ప్లాన్ చేశాడు కాని కరోనా వల్ల అది కాస్త సాగతీసినట్లుగా తీయాల్సి వచ్చింది. ఆచార్య విడుదలకు ముందే గాడ్ ఫాదర్ మరియు భోళా శంకర్ సినిమాలను మొదలు పెట్టాడు. ఆ రెండు సినిమాలతో పాటు బాబీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతుంది. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు నిన్న మొన్నటి వరకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ టైటిల్ తోనే చిరంజీవి సినిమా ప్రచారం జరిగింది. కాని తాజగా మరో టైటిల్ ప్రచారం అవుతోంది.
చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్లుగా టైటిల్ ఉండాలనే ఉద్దేశ్యంతో వాల్తేరు వీరయ్య ను కాస్త వాల్తేరు మొనగాడుగా మార్చేశారట. వాల్తేరు మొనగాడు సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం గాడ్ ఫాదర్ షూటింగ్ లో పాల్గొంటున్న చిరంజీవి ఆ సినిమా పూర్తి అయిన వెంటనే వాల్తేరు మొనగాడు సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన కథ చాలా విభిన్నంగా ఉంటుందనే నమ్మకం ను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.
చిరంజీవి ని అభిమానులు కోరుకునే మాస్ పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ సినిమా ప్రతి ఒక్క మెగా అభిమానికి కూడా నచ్చే విధంగా బాబీ తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు.
వాల్తేరు మొనగాడు కథ ను దర్శకుడు బాబీ చాలా కాలం క్రితమే రాసుకున్నాడట. చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ ఈ సినిమాలో సరికొత్తగా చూపించడంతో పాటు ఒక అభిమానిగా తాను ఎలా చిరంజీవిని చూడాలని అనుకుంటున్నాడో అలాగే చూపించబోతున్నాడట. బాబీ గత చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా చిరంజీవి ఆయనపై నమ్మకంతో ఈ సినిమా బాధ్యతలను అప్పగించాడు.
భారీ బడ్జెట్ తో కాకుండా ఎక్కువ రోజుల డేట్లు అవసరం లేకుండా బాబీ ఈ సినిమాను చిరంజీవితో సింపుల్ గా ఒక పవర్ ఫుల్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు బయటకు రావాల్సి ఉంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న వాల్తేరు మొనగాడు సినిమా ను ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.