Begin typing your search above and press return to search.
'బ్రహ్మాస్త్రం' ట్రైలర్ కు మెగాస్టార్ వాయిస్ ఓవర్..!
By: Tupaki Desk | 13 Jun 2022 8:39 AM GMTబాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ''బ్రహ్మాస్త్ర''. తెలుగులో ఈ సినిమా "బ్రహ్మస్త్రం" పేరుతో విడుదల కానుంది. రణ్ బీర్ కపూర్ - అలియాభట్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ - అక్కినేని నాగార్జున - మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
'బ్రహ్మాస్త్రం' సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రధాన నటీనటుల ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ లభించింది. జూన్ 15న ఈ మూవీ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. అయితే అంతకంటే ముందే ఈరోజు మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ తో వచ్చారు.
అదేంటంటే, మెగాస్టార్ చిరంజీవి 'బ్రహ్మాస్త్ర' సినిమాలో భాగం అవుతున్నారు. ఈ మాగ్నమ్ ఓపస్ ట్రైలర్ కు చిరు వాయిస్ ఓవర్ అందించనున్నారని చిత్ర బృందం తెలిపింది. లెజండరీ నటుడికి స్వాగతం పలుకుతూ మేకర్స్ దీనికి సంబంధించిన వీడియోని వదిలారు.
"ఆ బ్రహ్మస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖలలో చిక్కుకుందన్న విషయం ఆ యువకుడికే తెలియదు.. అతనే శివ.." అంటూ మెగాస్టార్ ఇంటెన్స్ వాయిస్ తో డబ్బింగ్ చెప్పడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఇదే వాయిస్ ఓవర్ తో ప్రారంభమయ్యే 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్.. మరో రెండు రోజుల్లో విడుదల కానుంది.
'బ్రహ్మాస్త్ర' చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందులో మొదటి భాగాన్ని ''బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ'' పేరుతో 2022 సెప్టెంబర్ 9న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
స్టార్ స్టూడియోస్ - ధర్మ ప్రొడక్షన్స్ - ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు కలిసి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
సౌత్ ఇండియాలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి 'బ్రహ్మాస్త్రం' సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. కింగ్ నాగార్జున - జక్కన్న తో పాటుగా ఇప్పుడు చిరంజీవి కూడా ఈ చిత్రంలో భాగం అవుతుండటంతో తెలుగులోనూ ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి రెట్టింపు అవుతోంది.