Begin typing your search above and press return to search.
మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్ .. ఎవరికి వారే!
By: Tupaki Desk | 11 Nov 2021 7:35 AM GMTవయసు మీద పడినా చేవ తగ్గలేదు. 60 ప్లస్ లోనూ వరుస సినిమాలతో వేడెక్కిస్తున్నారు ఆ ఇద్దరు సీనియర్ హీరోలు. వరుసగా ఒకదాని వెంట ఒకటిగా నాలుగైదు సినిమాల్ని ప్రకటించి హాట్ టాపిక్ గా మారారు. ఒకరితో ఒకరు పటీపడుతూ వరుస సినిమాల్ని లాంచ్ చేస్తూ వేడెక్కిస్తున్నారు. ఆ ఇద్దరూ ఎవరు? అంటే సమకాలీనంగా పాపులరైన హీరోలు .. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించే ఇదంతా.
మెగాస్టార్ చిరంజీవి 60 ప్లస్ లోనూ వరస సినిమాల్ని ప్రకటిస్తూ వేడెక్కిస్తున్నారు. ఆయన ఇప్పటికిప్పుడు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరో నలుగురు దర్శకులు చిరు క్యూలో ఉన్నారు. మోహన్ రాజాతో - గాడ్ ఫాదర్.. మెహర్ రమేష్ తో -భోళా శంకర్.. బాబీతో -వాల్తేరు వీరన్న అంటూ భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. నేడు భోళా శంకర్ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా మరో వారంలోనే బాబీతో వాల్తేరు వీరన్న సినిమాని ప్రారంభిస్తారని కథనాలొస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ఈ ఏజ్ లోనూ చిరు ఇంత స్పీడ్ గా ఎలా ఉన్నారు? అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇవి పూర్తవుతుండగానే వెనువెంటనే సినిమాలు చేసేందుకు చిరు క్రేజీ ప్రణాళికలతో ఆశ్చర్యపరుస్తున్నారు.
సౌతిండియాలో సీనియర్ స్టార్లలో ది బెస్ట్ అని నిరూపిస్తున్నారు చిరు. అయితే చిరంజీవికి సమకాలికుడిగా ఉన్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సైతం మాలీవుడ్ లో వరుస చిత్రాలను ప్రారంభిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయన చిరు శైలితో పోలిస్తే విభిన్న పంథాను అనుసరిస్తున్నారు. కేవలం కొన్ని నెలల్లోనే సినిమాల్ని పూర్తి చేసి బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. ఇక మెగాస్టార్ బడ్జెట్ల స్థాయి 70కోట్లు అంతకుమించి కాగా.. మోహన్ లాల్ చాలా పరిమిత బడ్జెట్లలోనే సినిమాల్ని పూర్తి చేసి సక్సెస్ అందుకుంటున్నారు. సినిమాల బడ్జెట్లు పంథా వేరు అయినా వరుస సినిమాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు ఆ ఇద్దరూ.
ఇక మెగాస్టార్ తనదైన ఇమేజ్ తో దూసుకుపోతుంటే మోహన్ లాల్ మాత్రం ఇమేజ్ సమస్య అన్నదే లేకుండా చాలా సాధా సీదా పాత్రలతోనూ మెప్పించడం రియలిస్టిక్ కథలతో విజయాలు అందుకోవడం చర్చకు వస్తోంది. ఇక చిరు సినిమా అంటే అదిరిపోయే డ్యాన్సులు ఫైట్స్ తప్పనిసరి. కానీ లాల్ సినిమాల్లో అలాంటి వాటితో పనే ఉండదు. ఇక మోహన్ లాల్ ఇటీవల తెలుగులోనూ అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రలతో మెప్పిస్తున్నారు. తక్కువ బడ్జెట్లో మాలీవుడ్ లో క్వాలిటీ సినిమాలు అందిస్తున్న స్టార్ గా మోహన్ లాల్ పేరు మార్మోగుతోంది. ఇక మరక్కార్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రయత్నించిన లాల్ కరోనా క్రైసిస్ కారణంగా ఓటీటీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. లాల్ ఇప్పటికిప్పుడు బరోజ్ అనే మైథాలజీ చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో రూపొందిస్తుండడం ఆశ్చర్యపరుస్తోంది. దృశ్యం ఫేం జీతు జోసెఫ్‌తో ట్వల్త్ మ్యాన్ అ... లూసీఫర్ ఫేం పృథ్వీరాజ్ దర్శకత్వంలో బ్రో డాడీ .. షాజీ కైలాస్ దర్శకత్వంలో అలోన్ లో నటించనున్నారు. పులి మురుగన్ ఫేం వైశాఖ్ తో `మాన్ స్టర్`లోనూ నటిస్తారు. ఇక చిరంజీవి సైమల్టేనియస్ గా మూడు నాలుగు సినిమాలు ప్రారంభించడం చకచకా పూర్తి చేసేందుకు ప్లాన్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది