Begin typing your search above and press return to search.
హీరోయిన్ ని లైవ్ లో డిప్రెషన్ గురించి ప్రశ్నించిన మెగాస్టార్
By: Tupaki Desk | 12 Sep 2021 8:45 AM GMTప్రస్తుతం అగ్ర కథానాయికలుగా వెలుగొందుతున్న ఎందరో ఒకప్పుడు డిప్రెషన్ కి చికిత్స పొందిన వారే. దీపిక పదుకొనే .. కంగన.. ఆలియా భట్ సహా ఎందరో నాయికలు డిప్రెషన్ ని ఎదుర్కొన్నామని ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం డిప్రెషన్ ని ఆత్మహత్యా యత్నాన్ని అధిగమించానని ప్రటించిన విషయం తెలిసిందే.
అయితే ఓ ప్రఖ్యాత గేమ్ షోలో ప్రముఖ కథానాయిక దీపిక పదుకొనేను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. అడిగిన ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశమైంది. బిగ్ బి హోస్ట్ గా పాపులర్ గేమ్ షో `కౌన్ బనేగా కరోడ్ పతి` కొత్త సీజన్ లో ప్రతి వారం ఇద్దరు ప్రముఖ అతిథులు ప్రదర్శనకు వచ్చి స్వచ్ఛంద సంస్థ కోసం ప్రజలను విరాళాలు కోరుతున్న సంగతి తెలిసిందే.
ఈసారి దీపికా పదుకొనే - దర్శకురాలు ఫరా ఖాన్ గేమ్ షోలో పాల్గొన్నారు. ఆ ఇద్దరి రాకతో ప్రదర్శన రక్తి కట్టింది. ఆటను చాలా చిరస్మరణీయంగా మలిచారని ప్రశంసించాలి. కానీ అమితాబ్ బచ్చన్ సూటిగా సుత్తి లేకుండా దీపికను డిప్రెషన్ గురించి ఓపెనవ్వాలని అడిగినప్పుడు మ్యాటర్ కొంచెం సీరియస్ అయింది.
చాలా భావోద్వేగ స్వరంతో దీపిక అకస్మాత్తుగా ఏడవడం ప్రారంభించింది. దీపికకు ఏదో సమస్య ఉందని తను సరిగ్గా లేదని ఆమె తల్లి ఉజ్జల పడుకొనే గుర్తించారు. వృత్తిపరమైన సహాయం తీసుకోవాలని సూచించారట. అదృష్టవశాత్తూ దీపిక తీవ్ర ఒత్తిడి నుండి బయటపడింది. ఆ తర్వాత తను బాలీవుడ్ అగ్ర కథానాయికగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఇక తన డిప్రెషన్ గురించి దీపిక గతంలోనూ పలు వేదికలపై బహిరంగంగానే వెల్లడించారు. దీపిక ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ కథానాయిక. నిర్మాతగానూ కొనసాగుతున్నారు. తెలుగులో ప్రభాస్ తో ఒక సినిమాకి సంతకం చేసింది. హీరోకి ధీటుగా పారితోషికం డిమాండ్ చేసిందని కథనాలొచ్చాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ లో దీపిక పాల్గొననుందని సమాచారం.
కేబీసీ షోని అలా రక్తి కట్టించారు!
KBC 13 ప్రస్తుతం హిందీ బుల్లితెరపై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజా ఎపిసోడ్ లో ఫరా ఖాన్ - దీపికా పదుకొనే ఇద్దరూ ప్రత్యేక కాజ్ కోసం డొనేషన్లు అడగడం హృదయాల్ని టచ్ చేసింది. ఈ కార్యక్రమంలో తాను గెలిచిన డబ్బులు పిల్లల కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే అరుదైన వ్యాధి అయిన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) తో బాధపడుతున్న పిల్లల కోసం అందజేస్తామని కొరియోగ్రాఫర్ కం దర్శకురాలు ఫరాఖాన్ అన్నారు. రోగగ్రస్తులైన కిడ్స్ కోసం చాలా ఖరీదైన ఇంజెక్షన్ ను కొనుగోలు చేయనున్నట్లు ఫరా వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ పిల్లల పరిస్థితి చూసి చలించిపోయారు. ఇలాంటి కాజ్ కోసం ద్రవ్య విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో సోనీ ఎంటర్ టైన్ మెంట్ టెలివిజన్ చేసిన కొత్త ప్రోమో వీడియోలో అమితాబ్ హిందీలో ``లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఫరా అనారోగ్యంతో బాధపడుతున్న అయాంష్ అనే 17 నెలల చిన్నారి కోసం ఈ గేమ్ ని ఆడుతోంది`` అంటూ ప్రకటించగా... ఆ వీడియో తర్వాత ఆయన్ష్ తల్లి తన బిడ్డ పరిస్థితిని వివరించే వీడియో స్ట్రీమింగ్ అయ్యింది. ఎపిసోడ అహూతులను కంటతడి పెట్టించింది. కన్నీటి పర్యంతమైన ఫరా ఖాన్ హిందీలో ``అయాన్ష్ రెండు సంవత్సరాల వయసులో ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ అయిన జోల్జెన్స్మా అనే ఔషధం తీసుకోవాల్సి ఉంటుంది. దాని ధర 16 కోట్లు. అది అతని ప్రాణాన్ని కాపాడుతుంది. మేము ఈ బిడ్డను కాపాడాలనుకుంటున్నాము సర్`` అని అన్నారు. తెలుగులోనూ పలు రియాలిటీ షోలు అత్యధిక టీఆర్పీని అందుకుంటున్నాయి. కానీ ఇలాంటి కాజ్ (ఒక మంచి పని) కోసం ఏదీ చేయడం లేదన్న విమర్శలున్నాయి. బిగ్ బాస్ సీజన్ 5 .. ఎవరు మీలో కోటీశ్వరుడు లో ఈ తరహాలో ఏదైనా మంచి విషయాన్ని ప్రవేశ పెడతారేమో వేచి చూడాలి.