Begin typing your search above and press return to search.
వాల్తేరు కి వచ్చేది వాసు కాదు వీరయ్య!
By: Tupaki Desk | 24 May 2022 1:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. 'ఆచార్య' రిలీజ్ అనంతరం సతీసమేతంగా అమెరికా ట్రిప్ ముగుంచికుని వచ్చిన చిరు వెంటనే షూట్ లో జాయిన్ అయ్యారు. మెగాస్టార్ మాస్ ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
పక్కా కమర్శియల్ చిత్రమని డైరెక్టర్ లీక్స్ ని బట్టి తెలుస్తుంది. చిరంజీవి అభిమానిగా..ఎంతో ప్రేమతో తెరకెక్కిస్తున్న చిత్రం. తన అభిమానం మొత్తం బాస్ పై ఈ సినిమాపై రూపంలో చూపించబోతున్నారు. ఈ ఒక్క మాట సినిమా ని పతాక స్థాయికి తీసుకెళ్లింది. బాబికి కమర్శియల్ చిత్రాల దర్శకుడిగా మంచి పేరుంది. 'పవర్'..'జై లవకుశ'..'వెంకీ మామ' వంటివి బాబి మార్క్ చిత్రాలుగా నిలిచాయి.
ఆ మూడింటి సక్సెస్ తర్వాత బాబి చిరు కోసమే వెయిట్ చేసి స్ర్కిప్ట్ సిద్దం చేసి..మెప్పించి సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ 'వాల్తేరు వీరయ్య' అని ఆరంభంలోనే తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. విశాఖపట్టణం వాల్తేరు బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ. ఇందులో చిరంజీవి రెండు పాత్రల్లో కనిపించనున్నారు. అందులో వీరయ్య అనేది వయసు మీద పడిన వ్యక్తి పాత్ర అని ఇప్పటికే ప్రచారం లో ఉంది.
ఆ తర్వాత వీరయ్య అనేది మరీ ఓల్డ్ ట్రెండ్ లా లుంది. వీరయ్య ప్లేస్ లో వాసు తగిలించి 'వాల్తేరు వాసు'గా టైటిల్ మార్పు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. కానీ టైటిల్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం అవ్వడంతో 'వాల్తేరు వీరయ్య'గానే బాగుంటుందని భావించి చివరికి అదే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తాజా సమచారం. చిరంజీవి కూడా వీరయ్య అయితేనే బాగుందని అన్నారుట.
దీంతో బాబి చిరంజీవి వీరయ్యగానే తెరపై చూపించబోతున్నారని దాదాపు ఖరారైనట్లే తెలుస్తోంది. దర్శకుడి విజన్ కి తగ్గట్టు తను అనుకున్న విధంగా చేయమని పూర్తి స్వేచ్చని చిరంజీవి కల్పించినట్లు సమాచారం. ఔట్ ఫుట్ విషయంలో చిరంజీవి దర్శకులకు కొన్ని కొన్ని సూచనలు..సలహాలు ఇస్తుంటారు. కానీ తుదిగా నిర్ణయం మాత్రం దర్శకుడికే వదిలేస్తారు.
తనవి కేవలం సలహాలు మాత్రమే గానే తీసుకుని..పనికొస్తాయంటే వాడుకోమని చెప్పే మనస్తత్వం గలవారు చిరంజీవి. కొన్ని కొన్ని సినిమాల్లో చిరంజీవి డైరెక్ట్ చేసిన సన్నివేశాలుంటాయి. ఇటీవల రిలీజ్ అయిన 'ఆచార్య'లోనూ అలాంటి సీన్లు ఉన్నాయని ప్రచారం సాగింది. కానీ 'వాల్తేరు వీరయ్య' విషయంలో మాత్రం వేలు పెట్టలేదని సమాచారం. మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కూడా ఆన్ సెట్స్ లో ఉంది.