Begin typing your search above and press return to search.
ఫ్లాపులు ఈ హీరోయిన్ ని ఏం చెయ్యలేవు!
By: Tupaki Desk | 30 Sep 2018 6:11 AM GMTఇండస్ట్రీ లో ఫ్లాప్ అనే మాట వినగానే చాలామంది హీరో.. హీరోయిన్ల నుండి దూరం పారిపోతారు. కానీ కొంతమందికి మాత్రం హిట్టు ఫ్లాపు అనే వాటితో సంబంధం లేకుండా అవకాశాలు వస్తుంటాయి. మరి అలాంటి లక్కీ బ్యూటీ మేఘా ఆకాష్. లక్కీ అంటే.. ఆమె లక్కీ అని.. ఆమెను సినిమాకు తీసుకున్నవాళ్లు కాదు..!
మేఘా ఆకాష్ కు స్టార్టింగ్ లోనే 'ఎన్ని నొక్కి పాయుం తొట్ట' అనే ధనుష్ సినిమాలో అవకాశం వచ్చింది. మేఘ ను చూసి ఇంప్రెస్ అయిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఆ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాడు. ఆ సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపు మూడేళ్ళయినా సినిమా మాత్రం విడుదల కావడం లేదు. ఇక తెలుగులో నితిన్ సినిమాలు రెండు చేసింది. 'లై'.. 'చల్ మోహన్ రంగ'. రిజల్ట్ సంగతి చెప్పేదేముంది..దొందూ దొందే.
ఇలా డిజాస్టర్స్ వస్తే హీరోయిన్స్ కు ఐరన్ లెగ్ ముద్ర వేస్తారు. కానీ మేఘ కు మాత్రం అలా జరుగుతున్నట్టు కనిపించడం లేదు. ఏకంగా రజనీకాంత్ 'పెట్టా' లో పడింది. అంతే కాదు.. హిందీలో ఆదిత్య పంచోలి హీరోగా తెరకెక్కనున్న బాలీవుడ్ చిత్రంలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఈ కాన్సెప్ట్ ను మనం ఎలా అర్థం చేసుకోవాలి. టన్నులు.. టన్నులు లక్కు ఉందనుకోవాలా లేదా.. ఫ్లాపుల తామరాకుపై ఆకాశం లో ఉన్న మేఘం నుండి జాలువారిన నీటి బొట్టు అనుకోవాలా? ఈరెండు కాకపోతే నక్కనేమైనా పెట్ గా ఉంచుకుంటోందా? ఆ సీక్రెట్ ఏంటో చెప్తే సవాలక్ష దరిద్రాలతో సతమతమయ్యే సామాన్యజనాలు కూడా ఫాలో అవుతారు. వాళ్ళకు కాస్త ఊరట లభిస్తుంది.