Begin typing your search above and press return to search.

మేఘా ఆకాష్.. కళ్ళు చెదిరే అందం!

By:  Tupaki Desk   |   29 Dec 2022 11:30 PM GMT
మేఘా ఆకాష్.. కళ్ళు చెదిరే అందం!
X
క్యూట్ హీరోయిన్ మేఘా ఆకాష్ బాక్సాఫీస్ వద్ద సోలో హీరోయిన్ గా అయితే ఇంతవరకు సరైన సక్సెస్ అందుకోలేదు. కానీ గ్లామరస్ బ్యూటీగా మాత్రం మంచి గుర్తింపు అందుకుంటోంది. పెద్దగా గ్లామర్ షో చేసింది లేదు. కానీ తన అందంతోనే అమ్మడు ఎక్కువగా సింపుల్ గా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కెరీర్ మొదట్లోనే ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చినప్పటికీ ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.

నితిన్ తో చేసిన లై సినిమాతో పాటు చల్ మోహనరంగా రెండు సినిమాలు కూడా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే అలాంటి డిజాస్టర్ సినిమాలు ఎన్ని ఎదురవుతున్నా కూడా అమ్మడు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతోంది. అంతేకాకుండా భాషతో సంబంధం లేకుండా సినిమాలో చేయడం విశేషం. గత ఏడాదిలోనే మేఘా ఆకాష్ కు నాలుగు అవకాశాలు వచ్చాయి.

ప్రస్తుతం కూడా చేతిలో మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక వీలైనంతవరకు తన గ్లామర్ డోస్ కూడా పెంచేందుకు ఈ బ్యూటీ ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతుంది. రీసెంట్ గా క్రిస్మస్ సెలబ్రేషన్ లో అమ్మడు లెగ్స్ అందాలు హైలైట్ అయ్యే విధంగా స్టైలిష్ గా ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. అందులో అమ్మడు తన చిరునవ్వుకు తోడుగా తన లెగ్స్ షోతో కూడా హైలెట్ గా నిలిచింది. దీంతో ఆ ఫోటోలు కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మేఘా ఆకాష్ కు సరైన సక్సెస్ అందితే మాత్రం స్టార్ హీరోయిన్స్ కు మంచి పోటీని ఇవ్వగలరని కూడా ఆమె ఫాలోవర్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ప్రస్తుతం అయితే ఈ బ్యూటీ చేతిలో 8 సినిమాల వరకు ఉన్నాయి. ఇక అందులో రెండు తమిళ సినిమాలతో పాటు మూడు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే మరికొన్ని హిందీ సినిమాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తెలుగులో అయితే రవితేజతో రావణాసుర సినిమాతో పాటు ప్రేమదేశం అనే మరో సినిమా చేస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.