Begin typing your search above and press return to search.
అరవింద సమేత మూడవ ముద్దుగుమ్మ!
By: Tupaki Desk | 29 Sep 2018 5:57 AM GMTఎన్టీఆర్ - త్రివిక్రమ్ ల కాంభినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘అరవింద సమేత’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున ఈ చిత్రంపై నందమూరి ఫ్యాన్స్ లో అంచనాలున్నాయి. ఇక త్రివిక్రమ్ మూవీ అంటే ఇద్దరు హీరోయిన్స్ తప్పని సరి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలో కూడా మొదటి నుండి ఇద్దరు హీరోయిన్స్ అంటూ ప్రచారం జరుగుతోంది.
పూజా హెగ్డేతో పాటు ఈ చిత్రంలో తెలుగమ్మాయి ఈషా రెబ్బా కూడా నటిస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. అయితే వీరిద్దరు కాకుండా ఈ చిత్రంలో మరో ముద్దుగుమ్మ కూడా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. తెలుగులో ఇప్పటికే ‘ఓమై గాడ్’ - ‘అనగనగా ఒక చిత్రం’ - ‘ఖాకీ’ల్లో కనిపించిన కన్నడ ముద్దుగుమ్మ మేఘ శ్రీ తాజాగా ఈ చిత్రంలో నటించినట్లుగా సమాచారం అందుతుంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఒక కీలకమైన రోల్ లో మేఘ శ్రీ కనిపించబోతుందని, ఎన్టీఆర్ మరియు ఈమె కాంబోలో ఎలాంటి సీన్స్ ఉంటాయో ఇంకా క్లారిటీ లేదు. త్రివిక్రమ్ ఈసారి ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలను రంగంలోకి దించడంతో సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 11న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.