Begin typing your search above and press return to search.
శ్రీహరి సన్స్: మేఘాంశ్ హీరో.. శశాంక్ డైరెక్టర్!
By: Tupaki Desk | 8 Jun 2019 1:30 AM GMTరియల్ స్టార్ శ్రీహరి - శాంతి జంట సుపుత్రులు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అంటూ సందేహించిన వారికి ఇదిగో వారసుడు బరిలో దిగుతున్నాడు అంటూ ఇటీవలే శుభవార్త వెలువడింది. శశాంక్ శ్రీహరి - మేఘాంశ్ శ్రీహరి ఇద్దరు సుపుత్రులు ఇప్పటికే సినీరంగంలో కెరియర్ కోసం ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉన్నారు. అందులో చిన్నోడు హీరో.. పెద్దోడు దర్శకుడు అవుతున్నారు. పెద్దవాడు దర్శకత్వం - రచన విభాగంలో ఎంతో ఆసక్తిగా ఉన్నానని `తుపాకి`కి తెలిపారు. ఇక చిన్నవాడైన మేఘాంశ్ శ్రీహరి మాత్రం హీరోగా పెద్ద తెరకు పరిచయం అవుతున్నారు. రాజ్ దూత్ అనేది సినిమా టైటిల్. ఇది పూర్తిగా యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. కార్తీక్- అర్జున్ దర్శకద్వయం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లక్ష్య ఫిలింస్ పతాకంపై ఎం.ఎల్.వి సత్యనారాయణ నిర్మిస్తున్నారు.
మేఘాంశ్ ఫస్ట్ లుక్ ఇదివరకూ రిలీజై ఆకట్టుకుంది. తాజాగా `రాజ్ దూత్` టీజర్ ని జీవిత రాజశేఖర్ చేతులమీదుగా హైదరాబాద్ ఎఫ్ఎన్‌సీసీలో లాంచ్ చేశారు. టీజర్ లో మేఘాంశ్ స్టన్నింగ్ లుక్ ఆకట్టుకుంది. అతడిలో హీరోయిక్ ఫీచర్స్.. ఫోటోజెనిక్ అప్పియరెన్స్ కి మీడియా నుంచి ప్రశంసలు దక్కాయి. మేఘాంశ్ తల్లి గారైన శాంతి శ్రీహరి మాట్లాడుతూ ..``వాడింకా చిన్న పిల్లాడిగానే భావిస్తున్నాను. హీరో అనగానే నాకే సిగ్గేస్తోంది. వీడు అమాయకుడు ఏం చేస్తాడో చూడాలి అనుకున్నా. కానీ ఈ టీజర్ చూశాక చెబుతున్నా ``నాన్న పేరు నిలబెడతాడు``. నేను షూటింగుకి వెళ్లలేదు. ఒకసారి ఎవరూ లేనప్పుడు సీక్రెట్ గా ఏం చేస్తున్నాడో చూడాలని వెళ్లాను. అతడిలో డ్యాన్సుల పరంగా నాలోని గ్రేస్ చూశాను. బావ శ్రీహరిలో ఉన్న స్పార్క్ మేఘాంశ్ లో ఉంది. నటుడిగా రాణిస్తాడని అనిపించింది. మీడియా ఎప్పుడూ మా కుటుంబంలా వెన్నంటి ఉంటుంది. శ్రీహరికి ఆశీస్సులు అందించినట్టే మీ ఆశీస్సులు మేఘాంశ్ కి కావాలి`` అని అన్నారు. ``మేఘాంశ్ హీరోగా ఎలా ఉంటాడు అన్న టెన్షన్ నాకు లేదు. ఎందుకంటే వాడు చాలా ట్యాలెంటెడ్. నాన్న పేరు చెడగొట్టకు అని తనకు నేను చెప్పాను. పేరు నిలబెడతాడన్న నమ్మకం ఉంది`` అని శాంతి `తుపాకి`కి వెల్లడించారు. ఇద్దరూ హీరోలు అవుతారా? అన్న ప్రశ్నకు .. పెద్దోడు శశాంక్ దర్శకత్వం - రైటింగ్ అంటే ఆసక్తిగా ఉన్నాడు. కానీ వాడు కూడా హీరో అవుతాడు. చిన్నోడు మేఘాంశ్ హీరోగా రాజ్ దూత్ తో పరిచయం అవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు.
మేఘాంశ్ మాట్లాడుతూ-``అమ్మా నాన్నలు లేకపోతే నేను లేను. వారు ఇచ్చిన అవకాశం... అదృష్టమే ఇది. హీరోగా మీ ముందుకు వస్తున్నాను. నాన్నను ప్రోత్సహించినట్టే నన్ను ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను. నన్ను పరిచయం చేస్తున్న నా నిర్మాత ఎం.ఎల్.వి.సత్యనారాయణ .. దర్శకద్వయం కార్తీక్- అర్జున్ కి ధన్యవాదాలు`` అన్నారు. మేఘాంశ్ ఇదివరకూ బాలనటుడిగా సుపరిచితం. నటన కొత్త కాదు. ఇక స్టేజ్ ఫియర్ కంటే బిడియం కాస్త ఎక్కువే. రాజ్ దూత్ ఈవెంట్ లో మేఘాంశ్ బ్రిలియంట్ స్పీచ్ ఆద్యంతం ఆకట్టుకుందన్న ప్రశంసలు దక్కాయి.