Begin typing your search above and press return to search.
రియల్ స్టార్ వారసుడి చుట్టూ కంచె వేశారు!
By: Tupaki Desk | 1 July 2019 7:05 AM GMTతీసుకున్నది ఏదైనా తిరిగిచ్చేయడం ప్రకృతి గుణం. అది మనుషులకు వర్తిస్తుంది. ఏ మనిషిలో అయినా మంచితనం.. ఆదుకునే గుణం ఉంటే.. అదే అన్ని వేళలా శ్రీరామరక్ష. ఆ రెండు సలక్షణాలు ఉన్న హీరోగా రియల్ స్టార్ శ్రీహరి పేరు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఆయన లేకపోయినా ఇప్పుడు ఆయన మంచితనమే అతడి ఫ్యామిలీని ఆదుకుంటోంది. రియల్ స్టార్ కీ.శే.శ్రీహరి వారసుడు మేఘాంశ్ శ్రీహరి `రాజ్ దూత్` అనే సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈనెల 5న సినిమాని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిన్న సాయంత్రం హైదరాబాద్ జేఆర్సీ సెంటర్ లో జరిగిన ప్రీరిలీజ్ వేడుక సందడిగా సాగింది. ఆసక్తికరంగా ఈ వేదికపై ఇండస్ట్రీ దిగ్గజాలెందరో కనిపించారు. ఇందులో దర్శకులు.. అగ్ర నిర్మాతలు ఉండడం ఆశ్చర్యపరిచింది. `సర్ధార్ గబ్బర్ సింగ్` చిత్రంతో మెగా దర్శకుడైన బాబి ముఖ్య అతిధిగా విచ్చేశాడు. అంతేకాదు రియల్ స్టార్ శ్రీహరి నటించిన `భద్రాద్రి` సినిమాకి రచయితగా పని చేశానని శ్రీహరిలోని మంచి క్వాలిటీస్ తనకు బాగా తెలుసని బాబి అన్నారు. ఒక ట్రావెల్ బస్సు లో ప్రయాణిస్తున్న ఓ జంట నలుగురు తాగుబోతుల వల్ల చిక్కుల్లో పడితే హైదరాబాద్ కు ఆ బస్సు చేరుకోగానే శ్రీహరి వారిని కాపాడి రియల్ స్టార్ అయ్యారని నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. తెల్లారకుండానే.. వేకువఝామున హైదరాబాద్ లో ఆగిన ఆ బస్సులో ఆ నలుగురికి బుద్ధి చెప్పి వారిని కాపాడారని.. అయితే ఆ సమయంలో శ్రీహరి పంచె కట్టుతోనే వెళ్లిపోయారని బాబి అనడం ఆశ్చర్యం కలిగించింది. కేవలం తన ఫోన్ నంబర్ తెలిసిన ఎవరో ఫోన్ చేస్తేనే అంత సాయానికి వెళ్లి రియల్ స్టార్ అయ్యారు శ్రీహరి. ఇక తనకు బాగా తెలిసిన ఎందరికో ఇంకా ఎన్నో సాయాలు చేశారని బాబి వెల్లడించారు. అంత మంచి మనిషి కుమారుడు మేఘాంశ్ వెండితెరకు పరిచయం అవుతున్నాడు. తనకు పరిశ్రమ అండదండలు ఉంటాయని.. తన వైపు నుంచి సాయం అందుతుందని తెలిపారు.
ఇక ఇదే వేదికపై టాలీవుడ్ సీనియర్ నిర్మాత .. నిర్మాతలమండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. రియల్ స్టార్ శ్రీహరి సినిమాలకు తానే ఫైనాన్స్ సహా థియేటర్ల సర్ధుబాటు వ్యాపకం చక్కదిద్దేవాడినని .. ఎన్టీఆర్ తర్వాత.. శ్రీహరి చనిపోయినప్పుడే అంత భారీగా జనం సందోహం దహన సంస్కారాలకు వచ్చారు. 16 కిలోమీటర్ల మేర జనాలంతా నడుచుకునే వచ్చారు. ఇంటికి ఉండే అన్ని కాంపౌండ్ వాల్స్ ఆ జనాల తాకిడికి పడిపోయాయి. బావ శ్రీహరి అంత అభిమానం సంపాదించుకున్నారని సి.కళ్యాణ్ తెలిపారు. చెల్లెమ్మ శాంతి శ్రీహరి వారసుడికి అండగా నిలుస్తానని ప్రకటించారు. మేఘాంశ్ రియల్ స్టార్ ని మించిన స్టార్ అవుతాడని ఆశీర్వదించారు. ఈ వేదికపై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వారసుడు విచ్చేసి శ్రీహరితో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. శ్రీహరి వారసుడు పెద్ద హీరోగా ఎదగాలని ఆకాంక్షించారు. శ్రీహరి సాయానికి ప్రతి సాయంగా అతడి వారసుడితో సినిమాలు తీసేందుకు సిద్ధంగా ఉన్నామని పలువురు దర్శకనిర్మాతలు ప్రకటించడం విశేషం. ఆసక్తికరంగా ఈ వేదిక వద్దకు శ్రీహరి అభిమానులు పెద్ద ఎత్తున విచ్చేసి యంగ్ రియల్ స్టార్ మేఘాంశ్ కి జై! అంటూ నినదించారు.