Begin typing your search above and press return to search.
భోళా శంకర్ తో స్టైలిష్ డైరెక్టర్ ఈజ్ బ్యాక్
By: Tupaki Desk | 23 Aug 2021 6:40 AM GMTప్రభాస్ తో బిల్లా సినిమాను చాలా స్టైలిష్ గా తెరకెక్కించి స్టైలిష్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న మెహర్ రమేష్ చివరి సినిమా షాడో వచ్చి ఎనిమిది ఏళ్లకు పైగా అయ్యింది. షాడోకు ముందు శక్తి సినిమాను తెరకెక్కించి డిజాస్టర్ చవి చూశాడు. శక్తి మరియు షాడో సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ అవ్వడంతో మెహర్ రమేష్ మళ్లీ కనిపించకుండా పోయాడు. ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న పరిచయాలు మరియు స్నేహాల కారణంగా సినిమాలకు దర్శకత్వం చేయకున్నా కూడా పెద్ద సినిమాల బ్యాక్ ఎండ్ వర్క్ ను ఆయనే చూసుకునేవాడు అంటూ వార్తలు వచ్చాయి. మహేష్ బాబు సినిమాలతో పాటు మెగా హీరోల సినిమాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ల్లో మెహర్ రమేష్ హ్యాండ్ ఎంతో కొంత అయినా ఉండేది అంటూ టాక్.
మహేష్ బాబుకు ఆప్తుడిగా.. మెగా ఫ్యామిలీకి సన్నిహితుడిగా ఉన్నా కూడా రీ ఎంట్రీకి దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు తీసుకున్న మెహర్ రమేష్ ఎట్టకేలకు మెగా స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. మెగా స్టార్ సినిమా భోళా శంకర్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న మెహర్ రమేష్ పై ప్రేక్షకులు ఈసారి చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన పాత సినిమాల గురించి పూర్తిగా మర్చి పోయి చిరంజీవితో ఒక మంచి సినిమాను చేస్తాడనే నమ్మకంతో వెయిట్ చేస్తున్నారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా భోళా శంకర్ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్.. చిరంజీవి ఇంకా కీర్తి సురేష్ ల రాఖి స్పెషల్ ఫస్ట్ గ్లింప్స్ ఇంకా టైటిల్ అన్ని విధాలుగా కూడా మెహర్ రమేష్ ఖచ్చితంగా మంచి సినిమాను అందించబోతున్నాడు అంటూ అభిమానులు నమ్మకంతో ఉన్నారు.
చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఆచార్య మరియు గాడ్ ఫాదర్ చిత్రాల కంటే కూడా అధికంగా భోళా శంకర్ సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగింది. తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళంకు ఇది రీమేక్ అయినా కూడా చాలా మార్పులు ఉండబోతున్నట్లుగా చెబుతున్నారు. బిగ్ బాస్ బ్యూటీ దివి ని కీలక పాత్ర కోసం తీసుకున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను అతి త్వరలోనే పట్టాలెక్కించబోతున్నారు. రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లతో ఈ సినిమా సక్సెస్ దక్కించుకుంటుందని.. ఈ సినిమా తో మెహర్ రమేష్ మళ్లీ టాలీవుడ్ లో బిజీ అవ్వడం ఖాయం అన్నట్లుగా నెటిజన్స్ నమ్మకంతో ఉన్నారు. మహేష్ బాబుకు మెహర్ రమేష్ అత్యంత ఆప్తుడిగా పేరు దక్కించుకున్నాడు. కనుక భోళా శంకర్ సినిమా సక్సెస్ అయితే మరే ఆలోచన లేకుండా మెహర్ రమేష్ తో సినిమాను చేసేందుకు మహేష్ బాబు ఓకే చెప్పే అవకాశాలు క్లీయర్ గా ఉన్నాయి. కనుక స్టైలిష్ డైరెక్టర్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు సినిమా ఆంద్రావాలను కన్నడంలో రీమేక్ చేసిన మెహర్ రమేష్ ఆ తర్వాత ఒక్కడు సినిమాను కూడా కన్నడంలో రీమేక్ చేశాడు. క్రాంతి తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన మెహర్ రమేష్ ఆ తర్వాత బిల్లా సినిమాను చేశాడు. బిల్ల సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటి వరకు మెహర్ రమేష్ రీమేక్ చేసిన సినిమాలు అన్ని కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక వేదాళం కు రీమేక్ గా రూపొందుతున్న భోళా శంకర్ సినిమా కూడా సెంటిమెంట్ ప్రకారం సక్సెస్ అవ్వడం ఖాయం అంటూ అభిమానులు ధీమాతో ఉన్నారు. వచ్చే ఏడాదిలో భోళా శంకర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.