Begin typing your search above and press return to search.
మెగాస్టార్ తో మెహర్ రమేష్ సినిమా ప్రకటన
By: Tupaki Desk | 21 Aug 2021 4:10 AM GMTఆగస్టు 22 .. బిగ్ డే! మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెభిమానులు సర్వసన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే. యాంకర్ సుమ హోస్ట్ గా ట్విట్టర్ స్పేసెస్ లో స్పెషల్ ఫ్యాన్స్ ఇంటరాక్షన్ కార్యక్రమం గురించి తెలిసినదే. ఇందులో పలువురు దర్శకనటులు పాల్గొంటారు. అలాగే ఈ స్పెషల్ డేని పురస్కరించుకుని `ఆచార్య` నుంచి గ్లింప్స్ రిలీజ్ కానుంది. మరోవైపు చిరు కథానాయకుడిగా మోహన్ రాజా తెరకెక్కిస్తున్న `లూసీఫర్` కి సంబంధించిన ప్రీలుక్ లాంచ్ ఉంటుందని ప్రకటించారు. బాబి .. మెహర్ రమేష్ ఎవరికి వారు చిరుతో తమ తదుపరి ప్రాజెక్టులకు సంబంధించిన గ్లింప్స్ ని షేర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఈసారి మెగాస్టార్ బర్త్ డే చాలా చాలా స్పెషల్ అనడానికి ఈ వేడుకలే సాక్ష్యం. తాజాగా మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా 22ఆగస్టు ఉదయం 9 గంటలకు #మెగా యూఫోరియా తో థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నామని మెహర్ రమేష్ బృందం సోషల్ మీడియాల్లో ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్- సీసీ మీడియా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకాలపై అనీల్ సుంకర - రామబ్రహ్మం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. #HBD మెగాస్టార్ చిరంజీవి అంటూ హ్యాష్ ట్యాగ్ తో ఈ విషయాన్ని వైరల్ చేసారు.
ప్రస్తుతం మెగాస్టార్ క్యూలో నలుగురు దర్శకులు ఉన్నారు. ఆచార్య రిలీజ్ అనంతరం మోహన్ రాజా తెరకెక్కిస్తున్న లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ రిలీజవుతుంది. ఇది మెగాస్టార్ నటిస్తున్న 153వ సినిమా. ఆ తర్వాత చిరు 154 .. చిరు 155 చిత్రాలకు ఎవరు దర్శకత్వం వహిస్తారు? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మెహర్ రమేష్.. బాబి ఇప్పటికే బౌండ్ స్క్రిప్టులతో రెడీగా ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరితో చిరు ముందుగా ప్రారంభిస్తారు? అన్నది వేచి చూడాలి.