Begin typing your search above and press return to search.

మెహబూబా కంటెంట్లో ఏముందో మరి

By:  Tupaki Desk   |   3 May 2018 4:37 PM GMT
మెహబూబా కంటెంట్లో ఏముందో మరి
X
డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాలా రోజుల తరువాత అందరూ తన సినిమా వైపు చూసేలా చేసుకున్నాడు. తనయుడు ఆకాష్ ని హీరోగా రీ లాంచ్ చేస్తూ చేసిన మెహబూబా ఈ ఈ నెల 11న రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. సినిమా ట్రైలర్ - పోస్టర్స్ తో పూరి సినిమాపై అంచనాలు పెంచేశాడు. పైగా దిల్ రాజు లాంటి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ సినిమాను ఇష్టపడి రిలీజ్ చేస్తున్నాడు అంటే సినిమాలో మ్యాటర్ గట్టిగానే ఉంది అనే టాక్ వస్తోంది.

దీంతో అభిమానులు కూడా సినిమాతో పూరి ఈ సారి 100% అలరించగలడు అని సినిమా రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇకపోతే మెహబూబా చిత్రం సెన్సార్ పనులు రీసెంట్ గా పూర్తయ్యాయి. ఈ లవ్ స్టోరీ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో కంటెంట్ కాస్త గట్టిగానే ఉందనే టాక్ వస్తోంది. ఇప్పటి వరకు సినిమాపై ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ రాలేదు, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండడంతో సెన్సార్ సర్టిఫికెట్ కూడా మరో విధంగా యూత్ లో ఆసక్తిని పెంచింది. యాక్షన్ రొమాంటిక్ సన్నివేశాలు కథలో భాగంగా చాలానే ఆకట్టుకుంటాయట.

పూరి చాలా రోజుల తరువాత ఒక లవ్ స్టోరీ చేసినట్లు చెప్పాడు. తప్పకుండా అందరికి నచ్చుతుందని నమ్మకంతో ఉన్నాడు. ఇండో - పాక్ బోర్డర్ నేపథ్యంలో వస్తోన్న ఈ ప్రేమ కథలో ఆకాష్ సైనికుడిగా కనిపించనున్నాడు. మరి ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సందీప్ చౌతా సంగీతాన్ని అందించాడు.