Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: మెహబూబా.. ఇదేందబ్బా?
By: Tupaki Desk | 9 Feb 2018 5:26 AM GMTఇన్నాళ్ళూ కేవలం పసలేని స్టోరీస్ తో హీరోయిన్ గ్లామర్ తో హీరో ఆటిట్యూడ్ తో సినిమాలు లాగించేస్తూ.. తన స్థాయిని తనే తక్కువ చేసుకుంటున్నాడు అంటూ పూరి జగన్ కొన్ని అబాండాలను అంటగట్టుకున్నాడు. అయితే ఒక్కసారిగా ఈ దర్శకుడు తనలోని సృజనాత్మక ఫిలిం మేకర్ ను బయటకు తీస్తే దాని తాలూకు ఔట్ పుట్ ఎలా ఉంటుంది? అదిగో మెహబూబా తరహాలో ఉంటుంది.
తన కొడుకు ఆకాష్ పూరీని హీరోగా పరిచయం చేస్తూ.. కన్నడ పిల్ల నేహా షెట్టిని హీరోయిన్ గా తీసుకొస్తూ.. బోర్డర్ నేపథ్యంలో ''మెహబూబా'' సినిమాను తీస్తున్నాడు పూరి. ఇక తన సినిమా టైటిల్ కు.. అలాగే కథకు చాలా నిజాయితీగా ఉంటూ.. మనోడు ఈ సినిమాను తీశాడని ఈ టీజర్ చూస్తే మనకు అర్ధమవుతుంది. బోర్డర్ దగ్గర్లో ఉన్న ఒక మిలటరీ స్థావరం.. దానిపై ఒక హెలికాప్టర్ ఎటాక్.. అక్కడ నుండి హీరోయిన్ ను కాపాడుకుని తీసుకుచ్చే సైనికుడే మన హీరో. ప్రతీ ఫ్రేమ్ లోనూ విజువల్ రిచ్నెస్ అదిరిపోయిందనే చెప్పాలి. గ్రాఫిక్స్ క్వాలిటీ నుండి సినిమాటోగ్రాఫీ వరకు విపరీతంగా ఆకట్టుకున్నాయంతే. బాలీవుడ్ లో వచ్చిన హైదర్ తరహా సినిమాలను తలదన్నేట్లు పూరి ఈ సినిమాను తీసుంటాడని ఈ టీజర్ చూస్తే చెప్పొచ్చేమో.
ఏదో రొటీన్ సినిమాను తీస్తున్నాడులే అనుకున్నవారందిరికీ ఇప్పుడు తన మార్కు ఇండో-పాక్ ప్రేమకథ.. యుద్దకథ.. యాక్షన్ రొమాన్స్ తో ఇదేందబ్బా అనే స్థాయిలో షాకిచ్చాడు పూరి జగన్. చూస్తుంటే పూరి కొడుకు ఆకాష్ కూడా తొలిసినిమాకే మార్కులు కొట్టేశేలా ఉన్నాడు. లెటజ్ సీ.