Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ: ‘మెహబూబా’
By: Tupaki Desk | 11 May 2018 8:48 AM GMTచిత్రం : ‘మెహబూబా’
నటీనటులు: పూరి ఆకాశ్ - నేహా శెట్టి - విషు రెడ్డి - మురళీ శర్మ - షాయాజి షిండే తదితరులు
సంగీతం: సందీప్ చౌతా
ఛాయాగ్రహణం: విష్ణు శర్మ
నిర్మాణం - రచన - దర్శకత్వం: పూరి జగన్నాథ్
ఒకప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్లతో బ్లాక్ బస్టర్లు ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్. కానీ గత పదేళ్లలో ‘టెంపర్’ లాంటి ఒకట్రెండు మినహా ఆయన చిత్రాలన్నీ తీవ్ర నిరాశకు గురి చేశాయి. చివరగా ‘పైసా వసూల్’తో దెబ్బ తిన్న పూరి.. ఈసారి తన కొడుకు పూరి ఆకాశ్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘మెహబూబా’ అనే ప్రేమకథ తీశాడు. పూరి గత చిత్రాలకు భిన్నంగా.. కొంచెం ఆసక్తికరంగా అనిపించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
రోషన్ (పూరి ఆకాశ్) ఇంజినీరింగ్ పూర్తి చేసిన కుర్రాడు. అతడికి సైన్యంలో చేరాలన్నది కల. ఆ ప్రయత్నంలో ఉన్న అతడిని సరిహద్దుల్లో తాను సైనికుడిగా యుద్ధంలో పోరాడుతున్నట్లు తరచుగా ఒక కల వెంటాడుతుంటుంది. మరోవైపు పాకిస్థాన్ కు చెందిన అఫ్రీన్ (నేహా శెట్టి) చదువు కోసం హైదరాబాద్ వస్తుంది. ఆమెకు అప్పటికే పెళ్లి నిశ్చయం అయి ఉంటుంది. అనుకోకుండా ఓ ప్రమాదంలో చిక్కుకున్న అఫ్రీన్ ను రోషన్ కాపాడతాడు. కానీ అప్పుడు వాళ్లిద్దరూ ఒకరినొకరు చూసుకోరు. తర్వాత అనుకోని పరిస్థితుల్లో కలిసిన వీళ్లిద్దరికీ అప్పటికే తమ మధ్య గొప్ప అనుబంధం ఉన్న భావన కలుగుతుంది. వాళ్లకు ఆ ఫీలింగ్ ఎందుకొచ్చింది.. రోహన్ కు తరచుగా వచ్చే కలకు దీనికి ఉన్న లింక్ ఏంటి.. వీళ్ల మధ్య అంతకుముందు ఏం జరిగింది అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
హీరోయిన్ పాకిస్థాన్ అమ్మాయి. హీరో హైదరాబాదీ కుర్రాడు. ఆమే తన ప్రాణమని ఆలస్యంగా గుర్తిస్తాడు. అంతే.. ఢిల్లీ నుంచి లాహోర్ వెళ్లే రైలెక్కేస్తాడు. ఇక్కడ హీరో ఫ్రెండొకడు మావోడు తన హీరోయిన్ కోసం పాకిస్థాన్ వెళ్తున్నాడహో అని ఒక పోస్ట్ పెడతాడు. ఇండియా మొత్తం ఆ విషయం హోరెత్తిపోతుంది. కోట్లాది మంది హీరోకు సపోర్టిచ్చేస్తారు. కేరళవాడు మలయాళంలో.. మహారాష్ట్రవాడు మరాఠీలో.. తమిళనాడు వాడు అరవంలో అమ్మాయిని తీసుకొచ్చేయమంటూ హీరోకు పిలుపిస్తారు. ఇక హీరో బార్డర్ దాటుతుంటే అక్కడ మన సైనికులు.. అమ్మాయిని తెచ్చేయ్ తర్వాత చూసుకుందాం అంటూ ఎంకరేజ్ చేసి పంపిస్తారు. మనోడు హీరోయిన్ని పాకిస్థాన్ నుంచి బైకుమీదే లేపుకొచ్చేస్తాడు. బార్డర్ దగ్గర ముందు ఎంకరేజ్ చేసిన సైనికులే మళ్లీ వచ్చేయ్.. తెచ్చేయ్ అంటుంటే హీరో అవతలి దేశం సైన్యంతో పోట్లాడి మరీ హీరోయిన్ తో సహా ఇటు దిగిపోతాడు. ఇదీ పూరి జగన్నాథ్ అండ్ కో సెన్సిబుల్ అండ్ ప్యూర్ లవ్ స్టోరీగా చెప్పుకున్న ‘మెహబూబా’లోని కొన్ని సన్నివేశాల తీరు.
లార్జర్ దన్ లైఫ్ హీరోయిజం ఉన్న కథల్ని ఎంత ఓవర్ ద బోర్డ్ తీసినా చెల్లిపోతుంది కానీ.. మరీ సెన్సిబుల్ గా తీయాల్సిన ప్రేమకథల్ని కూడా పూరి జగన్నాథ్ ఇలా నడిపిస్తే ఏం చెప్పగలం? మాఫియా నేపథ్యంలో తీసిన కథల్నే తీసి విసిగించేస్తున్నాడని ప్రేక్షకులు తిప్పి తిప్పి కొడుతుంటే ఈసారి కొడుకు కోసం భిన్నమైన లవ్ స్టోరీని ఎంచుకున్నాడు పూరి. పునర్జన్మల నేపథ్యంలో ప్రేమకథలు కొత్త కాకపోయినా.. ఇలాంటి కథను పూరి ఎంచుకోవడం.. దానికి ఇండియా-పాకిస్థాన్ బార్డర్ బ్యాక్ డ్రాప్ జోడించడం కొత్తగానే అనిపిస్తుంది. కానీ కథ అయితే మార్చాడు కానీ.. దాన్ని తెరమీద ఎగ్జిక్యూట్ చేయడంలో మాత్రం పూరి మళ్లీ విఫలమయ్యాడు. ప్రేమకథల్లో లీడ్ క్యారెక్టర్లతో ప్రేక్షకులు కనెక్టవడం.. వాటిలో తమను చూసుకోవడం.. ఆ పాత్రల తాలూకు భావోద్వేగాల్ని ఫీల్ కావడం.. వాళ్లు దూరమవుతుంటే బాధపడటం.. మళ్లీ కలవాలని తపించడం.. కలుస్తుంటే ఉద్వేగానికి గురి కావడం ముఖ్యం. ఇవన్నీ జరిగితే ఆ ప్రేమకథ ఆటోమేటిగ్గా పండుతుంది. కానీ ‘మెహబూబా’లో గత జన్మ.. ఈ జన్మ అంటూ రెండు ప్రేమకథలున్నాయి. కానీ ఎందులోనూ పైన చెప్పుకున్న తరహా ఫీలింగ్స్ ఎంత మాత్రం కలగవు. ఇక ఏం చెప్పాలి?
పూరి హీరో పాత్ర మామూలుగా చాలా బాధ్యతారాహిత్యంగా.. సమాజం.. దేశం అంటే ఏమాత్రం లెక్కలేనట్లుగా వ్యవహరిస్తాడు. కానీ ‘మెహబూబా’లో హీరో మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తాడు. చాలా బాధ్యతతో వ్యవహరిస్తాడు. పూరి సినిమాలో ఇలా హీరో పాత్రను చూడటమే కొత్తగా అనిపిస్తుంది. అలాగే పూరి ఇప్పటిదాకా ట్రై చేయని కథ కావడం వల్ల కూడా ఆరంభంలో సినిమా కొత్తగా అనిపిస్తుంది. ఈ కథను మొదలుపెట్టిన తీరు కూడా ఆసక్తి రేకెత్తిస్తుంది. పాకిస్థాన్ అమ్మాయి చదువు కోసం ఇండియాకు రావడం.. హీరో ఆమెను ఓ ప్రమాదం నుంచి బయటపడేయడం.. కానీ ఒకరినొకరు చూసుకోకపోవడం.. చివరికి వాళ్లిద్దరూ కలిసినపుడు ఒక విచిత్రమైన భావనకు లోనుకావడం.. లాజిక్ సంగతి వదలిస్తే ఈ ట్రాక్ అంతా కూడా పర్వాలేదన్నట్లే అనిపిస్తుంది. ఒకే తరహా పూరి మాఫియా కథలు చూసి చూసి అలసిపోయిన ప్రేక్షకులు దీన్ని కొత్తగానే ఫీల్ కావచ్చు. ప్రథమార్ధం ఓ మోస్తరుగా సాగిపోతుంది.
కానీ అసలు హీరో హీరోయిన్ల సంబంధమేంటి తెలిపే అసలు కథ మొదలుపెట్టాక పరిస్థితి అదుపు తప్పుతుంది. గత జన్మ కథను చెప్పే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో చెప్పుకోవడానికి ఏ విశేషం లేకపోయింది. కాశ్మీర్లో ప్రమాదకర లొకేషన్లలో ఎంతో ఖర్చు పెట్టి.. కష్టపడి తీశారని గ్రేస్ మార్కులు ఇవ్వాల్సిందే తప్ప విసుగెత్తించే ఈ ఎపిసోడ్ లో ప్రత్యేకత ఏమీ లేదు. కొత్తగా చెప్పుకోవడానికి ఒక్క సీన్ కూడా అందులో లేదాయె. ఇక వర్తమానంలోకి వచ్చాక గ్రాఫ్ మరింతగా పడిపోతుంది. పూరి ‘శివమణి’ రోజుల్లోకి వెళ్లి అప్పటి స్టయిల్లో హీరో హీరోయిన్లను కలిపే ప్రయత్నం చేశాడు. దీని గురించి చెప్పడానికేమీ లేదు. ప్రేమకథలకు అవసరమైన ఫీల్.. సున్నితత్వం.. భావోద్వేగాలు ఏమాత్రం లేకపోవడంతో ఒక సగటు సినిమాలాగే ముగుస్తుంది ‘మెహబూబా’. ఓవరాల్ గా చూస్తే పూరి గత సినిమాలతో పోలిస్తే ‘మెహబూబా’ కొంచెం భిన్నంగా.. కొంచెం మెరుగ్గా అనిపిస్తుందే తప్ప.. పూరి ఈజ్ బ్యాక్ అనిపించేలా ఎంతమాత్రం ఉండదు. పూరి కొడుకు ప్రతిభావంతుడే అని చెప్పడానికి మాత్రమే ఇది ఉపయోగపడిందంతే.
నటీనటులు:
ఇంతకుముందే బాల నటుడిగా.. ‘ఆంధ్రా పోరి’లో లీడ్ రోల్ లో మెప్పించిన పూరి ఆకాశ్.. ‘మెహబూబా’లో మరింత ఆకట్టుకుంటాడు. లుక్ చూస్తే అతడిలో ఇంకా పసితనపు ఛాయలు పోనట్లు.. ఇంకా హీరో అయ్యే వయసుకు రానట్లు అనిపిస్తుంది. మనిషి చూడ్డానికి మామూలుగా కనిపించాడు. కానీ నటన విషయంలో మాత్రం పరిణతి చూపించాడు. హీరోలా కాకుండా ఒక పాత్రధారిగా మాత్రమే కనిపిస్తూ.. ఆ పాత్రకు తగ్గట్లుగా నటిస్తూ మెప్పించాడు. ఎమోషనల్ సీన్లలో ఆకాశ్ చాలా బాగా చేశాడు. సినిమాలో అతి పెద్ద విశేషం ఆకాశే అంటే అతిశయోక్తి లేదు. హీరోయిన్ నేహా శెట్టి పర్వాలేదు. ఆమెలో హీరోయిన్ ఫీచర్లు తక్కువే. గ్లామర్ విషయంలో సాధారణంగా అనిపిస్తుంది. నటన విషయంలో ఓకే. బాగానే చేసింది. విలన్ పాత్రలో విషు రెడ్డి ఓకే. మురళీ శర్మ.. షాయాజి షిండే తమ పాత్రలకు తగ్గట్లు నటించారు. మిగతా వాళ్లంతా మామూలే.
సాంకేతికవర్గం:
చాన్నాళ్ల తర్వాత తెలుగులో సినిమా చేసిన సందీప్ చౌతా తన ప్రత్యేకతను చాటలేకపోయాడు. మెహబూబాతో పాటు మరో పాట మాత్రమే ఓకే అనిపిస్తాయి. మొత్తంగా పాటలు అంత ప్రభావం చూపలేదు. ఒక ప్రేమకథను ఎలివేట్ చేసే స్థాయిలో పాటలు లేవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. విష్ణు శర్మ ఛాయాగ్రహణం బాగుంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. కాశ్మీర్ లొకేషన్లను బాగానే చూపించారు. సీజీఐ వర్క్ తేలిపోయింది. దాంతో ముడిపడ్డ సన్నివేశాలు చాలా పేలవంగా ఉన్నాయి. అక్కడక్కడా కొంచెం తేడా వచ్చినా మొత్తంగా నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. సినిమాపై బాగానే ఖర్చు పెట్టారు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫాంలో లేడనడానికి.. ఈ తరం ప్రేక్షకుల అభిరుచిని ఆయన అర్థం చేసుకోవట్లేదనడానికి ‘మెహబూబా’ రుజువుగా నిలుస్తుంది. ప్రేక్షకుల అభిరుచి మారి.. రియలిస్టిగ్గా.. సెన్సిబుల్ గా సాగే సినిమాల్ని ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. కానీ పూరి మాత్రం ఏ కథనైనా లౌడ్ గా.. ఓవర్ ద బోర్డ్ తీస్తానంటే కష్టం.
చివరగా:మెహబూబా.. కథ మారింది.. పూరి మారలేదు
రేటింగ్- 1.75/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre