Begin typing your search above and press return to search.
ఐతే శక్తి ఫ్లాప్ కు మెహర్ రమేష్ కారణం కాదా?
By: Tupaki Desk | 24 Oct 2022 12:30 PM GMTఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాలు చాలానే ఉంటాయి. కానీ శక్తి పేరు చెబితే నందమూరి అభిమానులు సైతం బాబోయ్ నీకో దండం అన్నట్లుగా శక్తి సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా దెబ్బకు నిర్మాత అశ్వినీదత్ ఆస్తులు అమ్ముకున్నాడని వార్తలు వచ్చాయి.. దర్శకుడు మెహర్ రమేష్ కెరీర్ ని కోల్పోయాడని చెప్పాలి.
మెహర్ రమేష్ పదేళ్ల తర్వాత శక్తి ని జనాలు మర్చిపోయానా నేపథ్యంలో చిరంజీవి తో భోళా శంకర్ సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. భోళా శంకర్ సినిమా విడుదల వచ్చే సమ్మర్ లో ఉండబోతుంది. ఇదే సమయంలో ఆయన శక్తి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా బిల్లా సినిమా ను రీ రిలీజ్ చేయడం జరిగింది. ఆ సినిమా రీ రిలీజ్ సందర్భంగా మెహర్ రమేష్ ఒక ఇంటర్వ్యూలో శక్తి గురించి మాట్లాడాడు. ఎన్టీఆర్ తో తాను చేయాలి అనుకున్న కథ వేరు.. చేసిన కథ వేరు అన్నట్లుగా చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ గారితో సినిమాను అనుకున్న తాను షూటింగ్ మొదలు పెట్టడానికి వెంటనే డేట్లు లభించలేదు. బృందావనం సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ ఉన్నందున ఆరు నెలల సమయం లభించింది. ఆ ఆరు నెలల సమయంలో నేను అనుకున్న కథను పూర్తిగా అశ్వినీదత్ గారు మారిపోయేలా చేశారు.
కథకు ఆధ్యాత్మిక జోడింపు కల్పించడం వల్ల మొత్తం మారిపోయింది. కథ విషయంలో అశ్వినీదత్ గారు నన్ను చాలా మందితో కల్పించారు.. ఆ సమయంలోనే సినిమా కథ చాలా మారిందని మెహర్ రమేష్ పేర్కొన్నాడు. శక్తి సినిమా తన వల్ల ఫ్లాప్ అవ్వలేదని.. తనను కొందరు తప్పదోవ పట్టించడం వల్లే ఫ్లాప్ అయ్యిందని మెహర్ రమేష్ ఇండైరెక్ట్ గా నిర్మాత అశ్వినీదత్ పై విమర్శలు చేశాడు.
మొత్తానికి శక్తి ఫ్లాప్ కి కారణం తాను కాదు అంటూ మెహర్ రమేష్ ఇన్నాళ్ల తర్వాత చెప్పడం ఒకింత ఆశ్చర్యంగా ఉంది. మరి షాడో ఫలితం పై మెహర్ రమేష్ స్పందన ఏంటి అంటూ కొందరు ఎన్టీఆర్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.