Begin typing your search above and press return to search.

పవన్ నుండి చాలా 'శక్తి'వంతమైన హామీ దక్కినట్లుంది!

By:  Tupaki Desk   |   25 Oct 2022 12:30 AM GMT
పవన్ నుండి చాలా శక్తివంతమైన హామీ దక్కినట్లుంది!
X
శక్తి మరియు షాడో సినిమాలు బ్యాక్ టు బ్యాక్‌ ఫ్లాప్ వల్ల దర్శకుడు మెహర్ రమేష్ కనిపించకుండా పోయాడు. ఏకంగా పదేళ్ల పాటు ఆయన నుండి సినిమా రాలేదు. ఎట్టకేలకు మెహర్‌ రమేష్‌ కి ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవి భోళా శంకర్ సినిమా ఆఫర్‌ వచ్చింది. ఆ సినిమా తర్వాత మెహర్‌ రమేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇన్నాళ్లు సినిమాలు చేయకున్నా కూడా మహేష్ బాబుతో పాటు మెగా ఫ్యామిలీకి చాలా సన్నిహితంగా మెహర్‌ రమేష్ కొనసాగుతూ వస్తున్నాడు. అందుకే ఆయన సినిమాలు చేయకున్నా ఈ గ్యాప్ లో ఎన్నో సినిమా లకు షాడో డైరెక్టర్ గా వర్క్ చేయడంతో పాటు ఎన్నో సినిమాల యొక్క స్క్రిప్ట్‌ వ్యవహారాలు చూసుకున్నాడు.

వరుసగా ఫ్లాప్ అయినా కూడా మెహర్‌ రమేష్ అంటే చాలా మందిలో మంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే చిరంజీవి ఛాన్స్ ఇచ్చాడు. అదే నమ్మకంతో పవన్‌ కళ్యాణ్ కూడా మెహర్‌ రమేష్ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా అనిపిస్తోంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మెహర్‌ రమేష్ మాట్లాడుతూ వంద శాతం తాను పవన్‌ కళ్యాణ్ తో సినిమాను చేస్తాను అంటూ బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు. ఇప్పటికే కమిట్‌ అయ్యి అనౌన్స్ చేసిన వారు కూడా పవన్ తో తమ సినిమాను పూర్తి చేస్తాం అంటూ చెప్పలేక పోతున్నారు. కానీ మెహర్‌ రమేష్ మాత్రం చాలా బలంగా చెబుతున్నాడు.

ఆయన మాటలను బట్టి చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ నుండి బలమైన హామీనే ఈయనకు దక్కినట్లుగా తెలుస్తోంది. పవన్‌ కళ్యాణ్ కి మెహర్‌ రమేష్ కి మధ్య బందుత్వం ఉంటుంది. ఆ బంధుత్వం కారణంగానే సినిమాలు చేసేందుకు ఓకే చెబుతున్నారా అనేది కొందరి అనుమానం.

పవన్ మరియు మెహర్‌ రమేష్ ల కాంబోలో మరీ ఆలస్యం కాకుండా వెంటనే సినిమా ఉండే అవకాశం ఉందంటున్నారు. అది ఎప్పుడు అనేది త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి. చిరంజీవితో మెహర్‌ తెరకెక్కించిన భోళా శంకర్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల అవ్వబోతుంది. చిరు.. పవన్‌ లతో సినిమా సక్సెస్ అయితే మహేష్ బాబు నుండి కూడా మెహర్‌ కి సిగ్నల్‌ దక్కే అవకాశం లేక పోలేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.