Begin typing your search above and press return to search.
ఆ ప్రశ్నని మహేష్ ఎక్స్ పెక్ట్ చేశాడట
By: Tupaki Desk | 17 Aug 2015 10:29 AM GMTఎప్పుడూ లేని రీతిలో తన సినిమాని ఎగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు మహేష్. ఇదివరకు తన సినిమా విడుదలకు ముందు మీడియా ముందుకొచ్చి ఇంటర్వ్యూ లు ఇవ్వడానికి కూడా మహేష్ తటపటాయించేవాడు. నా కంటే నా సినిమానే మాట్లాడుతుందన్నట్టు వ్యవహరించేవాడు. కానీ `శ్రీమంతుడు`ని మాత్రం కనీవినీ ఎరుగని రీతిలో ప్రమోట్ చేస్తున్నాడు మహేష్. సినిమా విడుదలకు ముందు ఒక దఫా ఇంటర్వ్యూ లు ఇచ్చాడు, విడుదలయ్యాక మళ్లీ ఓ దఫా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఎఫ్.ఎమ్. స్టేషన్ లు, టీవీ ఛానళ్లు... అబ్బో ఎక్కడ చూసినా `శ్రీమంతుడు` కబుర్లే. మహేష్ భార్య నమ్రత కూడా రంగంలోకి దిగి ప్రమోషన్ వ్యవహారాల్ని చూసుకొంటోంది. ఇదంతా చూస్తున్న పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. సినిమాకి మహేష్ ఓ నిర్మాత కావడంతోనే అంత అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడని మాట్లాడుకొంటున్నారు. అదే సందేహాన్ని మీడియా కూడా మహేష్ ముందు వ్యక్తం చేసింది.
`మీరు నిర్మాత కావడంతోనే ఇంతగా ప్రమోట్ చేస్తున్నారా?` అని మీడియా ప్రతినిధులు మహేష్ ని అడిగితే... మీరు ఈ ప్రశ్న అడుగుతారని నాకు తెలుసు అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు మహేష్. ``ఏ సినిమాకైనా ప్రమోషన్ చాలా ముఖ్యం. `శ్రీమంతుడు`లాంటి సినిమాలకైతే ఇంకా ముఖ్యం. కాన్సెప్ట్ ని ప్రేక్షకు ల్లోకి తీసుకెళ్లాలి. సోషల్ ఎలిమెంట్ ఆధారంగా రూపొందిన కథ కాబట్టి ఆ కాన్సెప్ట్ ప్రేక్షకులకు చేరువ కావాలనే ఇలా ప్రమోట్ చేస్తున్నా`` అని చెప్పుకొచ్చాడు మహేష్. ఆగస్టు 15, ఆదివారం కలిసిరావడంతో `శ్రీమంతుడు`కి మరో బలమైన వీకెండ్ వచ్చినట్టయింది. అందుకే మహేష్ ఆ రెండు రోజులపై బాగా కాన్సంట్రేట్ చేసి సినిమాని ప్రమోట్ చేశాడు. `కిక్2` వచ్చే వరకు `శ్రీమంతుడు`దే సందడి. ఇప్పటికే లాభాల బాట పట్టిన శ్రీమంతుడుకి ఇప్పుడు ప్రమోషన్ కూడా తోడవడంతో రాబోయే రెండు వారాల్లో మరిన్ని లాభాలు కూడగట్టుకొంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తమ్మీద మహేష్ హీరోగా, నిర్మాతగా సూపర్‌హిట్టయ్యాడు.