Begin typing your search above and press return to search.

మెహ్రీన్ కూడా కోటి అడిగిందట

By:  Tupaki Desk   |   18 Nov 2021 1:30 PM GMT
మెహ్రీన్ కూడా కోటి అడిగిందట
X
నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఘోస్ట్‌ సినిమాలో హీరోయిన్‌ గా కాజల్ ను తీసుకోవడం జరిగింది. షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత కరోనా తో గ్యాప్ వచ్చింది. ఈ సమయంలో కాజల్‌ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆమె వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకోవడంతో ఇప్పుడు చిత్ర యూనిట్‌ సభ్యులు హీరోయిన్ కోసం జల్లెడ పట్టాల్సి వస్తోంది.

ఒకరు ఇద్దరిని ఓకే చేసినా కూడా వారి పారితోషికం విషయంలో సెట్‌ అవ్వడం లేదు. అమలా పాల్ ను సంప్రదించగా ఆమె కోటికి తగ్గితే చేయను అనేసిందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకు కోటి ఇవ్వడం ఏంటీ అనుకున్న మేకర్స్‌ మరో హీరోయిన్‌ కోసం అన్వేషిస్తున్నారు. తాజాగా మెహ్రీన్ ను చిత్ర బృందం సంప్రదించారట.

నాగార్జునతో నటించేందుకు మెహ్రీన్ ఓకే చెప్పిందట. కాని అందుకు గాను ఆమె కూడా కోటి రూపాయల పారితోషికంను డిమాండ్‌ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఎఫ్‌ 3 లో ఒక వైపు నటిస్తున్న మెహ్రీన్ ఆ సినిమా కంటే చాలా ఎక్కువ మొత్తంను డిమాండ్ చేసిందట.

నాగార్జున వంటి సీనియర్ హీరోతో సినిమాలో నటించడం వల్ల ముందు ముందు కెరీర్ లో తనకు యంగ్‌ హీరోలతో ఛాన్స్ లు వచ్చే అవకాశం తగ్గుతుంది. అందుకే కోటి రూపాయల పారితోషికం ఇస్తే ఒప్పుకుంటాను అన్నట్లుగా మెహ్రీన్ వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు.

మెహ్రీన్ కోటి పారితోషికం డిమాండ్‌ తో మళ్లీ చిత్ర యూనిట్‌ సభ్యులు సందిగ్దంలో పడ్డట్లుగా తెలుస్తోంది. త్వరలో ఘోస్ట్‌ తదుపరి షెడ్యూల్‌ షురూ అవ్వాల్సి ఉంది. కనుక అప్పటి వరకు హీరోయిన్ విషయంలో ఒక నిర్ణయానికి దర్శక నిర్మాతలు రావాలని భావిస్తున్నారు. అందుకే నిర్ణయం తీసుకునే విషయంలో స్పీడ్‌ గా ఉండాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇలియానా.. త్రిషలతో పాటు ఇంకా పలువురు హీరోయిన్స్ ను ఘోస్ట్‌ సినిమాలో పాత్ర కోసం పరిశీలించగా ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు సెట్‌ అవ్వడం లేదు. సీనియర్‌ హీరోలకు హీరోయిన్‌ సమస్యలు రావడం ఈమద్య కాలంలో కామన్‌ అయ్యింది. చిరంజీవి కి కూడా ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకు గాను చాలా మంది హీరోయిన్స్ పేర్లను పరిశీలించారు. ఇప్పుడు నాగార్జున ఘోస్ట్‌ సినిమాకు కూడా హీరోయిన్స్ ఒక పట్టాన లభించడం లేదు.

మెహ్రీన్‌ పెద్దగా సినిమాలు ఏమీ చేయడం లేదు. ఇటీవల చేసిన మంచి రోజులు వచ్చాయి కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ సినిమా ప్లాప్ అయినా కూడా మెహ్రీన్‌ కోటి డిమాండ్‌ చేయడం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చివరకు నాగర్జునకు జోడీగా ఎవరు ఖరారు అవుతారో చూడాలి.