Begin typing your search above and press return to search.
నిర్మాతల మండలికి మెహ్రీన్ పంచాయితి
By: Tupaki Desk | 15 Dec 2018 6:01 AM GMTఈ మద్య కాలంలో యువ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మెహ్రీన్ మారిపోయింది. ఎన్నో చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న మెహ్రీన్ కు సక్సెస్ లు మాత్రం ఆశించిన స్థాయిలో దక్కడం లేదు. మెహ్రీన్ ఈ మద్య కాలంలో నటించిన వరుస చిత్రాలు బాక్సాఫీస్ ముందు బొక్క బోర్లా పడుతున్నాయి. అయినా కూడా ఈమె కు ఆఫర్లు మాత్రం బాగానే వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే మెహ్రీన్ ఒక వివాదం నిర్మాతల మండలి వరకు వెళ్లింది.
సుధీర్ బాబు తో సినిమాను ప్లాన్ చేసిన ఒక నిర్మాత మెహ్రీన్ కు అడ్వాన్స్ ఇచ్చాడట. సుధీర్ బాబు తో నటించేందుకు మెహ్రీన్ డేట్లు కూడా ఇవ్వడం జరిగిందట. అయితే ఏదో కారణం వల్ల సుధీర్ బాబు ఆ సినిమా నుండి తప్పుకోవడంతో ఆ ప్రాజెక్ట్ కాస్త క్యాన్సిల్ అయ్యింది. అదే నిర్మాత మరో హీరో తో సినిమాను మొదలు పెట్టాడు. ఇప్పుడు ఆ నిర్మాత మెహ్రీన్ కు ఇచ్చిన అడ్వాన్స్ ను తిరిగి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాడు. కాని మెహ్రీన్ మాత్రం అడ్వాన్స్ ను ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు.
తాను డేట్లు ఇస్తే వాటిని దుర్వినియోగం చేశారని, తన డేట్లు వృదా చేసినందుకు గాను అడ్వాన్స్ ఇచ్చేది లేదు అంటూ నిర్మాతల మండలి ముందు మెహ్రీన్ వాదనలు వినిపిస్తుందని తెలుస్తోంది. ఆ నిర్మాత మాత్రం అడ్వాన్స్ ఇవ్వాల్సిందే అంటూ గట్టిగా పట్టుబడుతున్నాడు. మరి ఈ విషయమై నిర్మాతల మండలి ఎలాంటి నిర్ణయంను తీసుకుంటారో చూడాలి.