Begin typing your search above and press return to search.

అమెరికాలో అస‌లేం జ‌రిగిందో చెప్పిన మెహ‌రీన్

By:  Tupaki Desk   |   3 July 2018 6:54 AM GMT
అమెరికాలో అస‌లేం జ‌రిగిందో చెప్పిన మెహ‌రీన్
X
టాలీవుడ్‌కు చెందిన న‌టీమ‌ణుల‌తో క‌లిసి కిష‌న్ మోదుగుముడి దంప‌తులు నిర్వ‌హించిన సెక్స్ స్కాండ‌ల్ బ‌య‌ట‌కు రావ‌టం.. పెను సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. అమెరికాలో నిర్వ‌హించే క‌ల్చ‌ర‌ల్ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌య్యేందుకు వీసాల కోసం అప్లై చేసుకున్న వారికి రిజెక్ట్ చేయ‌టం తెలిసిందే.

ఈ ఎపిసోడ్‌ లో టాలీవుడ్‌ న‌టి మెహ‌రీన్ ను అమెరికా అధికారులు విచారించిన వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీనిపై ఆమె ఒక మీడియా సంస్థ‌తో మాట్లాడిన‌ట్లుగా ఒక వార్తా క‌థ‌నం ప‌బ్లిష్ అయ్యింది. కెన‌డా నుంచి వాంకోవ‌ర్ నుంచి లాస్ వేగాస్ కి హాలీడే ట్రిప్ నేప‌థ్యంలో మెహ‌రీన్ ను అధికారులు విచారించిన వైనం పై ఆమె స్పందించారు.

స‌ద‌రు మీడియా సంస్థ‌లో పేర్కొన్న‌ట్లుగా తాను ఎవ‌రికి ఎలాంటి ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌లేద‌ని పేర్కొన్నారు. అంతేకాదు.. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా అమెరికాలో అస‌లేం జ‌రిగిందో ఆమె వెల్ల‌డించారు. తాను ఇంట‌ర్వ్యూ ఇచ్చిన‌ట్లుగా పేర్కొన‌టం.. తాను చెప్పిన‌ట్లుగా కొన్ని అంశాల్ని ప్ర‌స్తావించ‌టం లాంటివేమీ జ‌ర‌గ‌లేద‌ని.. అవ‌న్నీ ఉత్త అబ‌ద్ధాలుగా మెహ‌రీన్ కొట్టిపారేశారు. అస‌లేం జ‌రిగిందో ఆమె మాట‌ల్లోనే..

మా కుటుంబంతో క‌లిసి వాంకోవ‌ర్ నుంచి లాస్ వెగాస్ కు వీకెండ్ హాలిడే కోసం వెళ్లాను. అక్క‌డి ఇమ్మిగ్రేష‌న్ అధికారుల వ‌ద్ద‌కు వెళ్లిన‌ప్పుడు న‌న్ను తెలుగు న‌టిగా గుర్తించారు. అక్క‌డి స‌రిహ‌ద్దు అధికారులు అమెరికాలో నా టూర్ కి కార‌ణం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. అప్పుడే తొలిసారి సెక్స్ స్కాండ‌ల్ గురించి తెలిసింది.

ఆ ఇష్యూతో నాకు ఎలాంటి సంబంధం లేద‌ని గుర్తించిన అధికారులు సారీ చెప్పి మ‌రీ నా ప్ర‌యాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు. ఇత‌రులు దీని గురించి చెప్పే కంటే నేనే చెప్ప‌టం మంచిద‌ని ఈ ప్ర‌క‌ట‌న చేస్తున్నా. నిజానికి అక్క‌డ ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర్కొన్న‌ది వాస్త‌వమే అయిన‌ప్ప‌టికీ.. అది నా వ్య‌క్తిగ‌త అంశం. ఎవ‌రో ఏదో చేసిన ప‌నికి ఇండ‌స్ట్రీకి చెడ్డ పేరు రావ‌టం బాధ క‌లిగిస్తోంది. త‌ప్పు చేసినోళ్ల‌కు స‌రైన శిక్ష ప‌డుతుంద‌ని భావిస్తున్నా. తెలుగు ఇండ‌స్ట్రీ న‌న్ను ఎంత‌గానో అద‌రించింది.. ఈ విష‌యంపై మాట్లాడ‌టం ఇదే చివ‌రిసారి అంటూ ముగించింది. నిజ‌మే.. ఈ విష‌యంపై మాట్లాడే ప‌రిస్థితి మెహ‌రీన్ కు ఎదురుకాకూడ‌ద‌నే కోరుకుందాం.