Begin typing your search above and press return to search.
దర్శకేంద్రునికే హనీ పాఠాలు!
By: Tupaki Desk | 3 March 2019 5:45 AM GMTసినిమాకి పెర్ఫెక్ట్ ఆర్టిస్ట్ ఎంత ఇంపార్టెంటో క్యారెక్టర్ (ఆర్టిస్టు) కి మ్యానరిజం అంతే ఇంపార్టెంట్. ఒకసారి ఆ మ్యానరిజం ఆడియెన్ కి కనెక్టయితే ఇక అది బ్లాక్ బస్టరే. సరిగ్గా అదే ఫ్యాక్టర్ ఎఫ్ 2 బిగ్ సక్సెస్ కి కారణమైంది. `హనీ ఈజ్ ద బెస్ట్` మ్యానరిజం మెహ్రీన్ కి అలానే కలిసొచ్చింది. ఇన్నాళ్లుగా అసలు హిట్టు అన్నదే లేని మెహ్రీన్ కి హిట్టు దక్కడమే కాదు హనీ పాత్రలో తన పెర్ఫామెన్స్ కి చక్కని ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం మెహ్రీన్ హిట్టొచ్చిన వేళ ఆ ఆనందాన్ని ఎఫ్ 2 అర్థ శతదినోత్సవంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రునితోనే పంచుకుంది. వేదిక దిగువన ఆయన చెంతనే కూచుని మెహ్రీన్ చేసిన సందడి అంతా ఇంతా కాదు.
`హనీ ఈజ్ ద బెస్ట్` మ్యానరిజం ఎలానో నేర్పించవా? అని రాఘవేంద్రుడు అడిగేస్తే.. మెహ్రీన్ ఇలా పాఠాలు చెప్పింది. ఈ పాఠం రాఘవేంద్రుడికి ఎక్కిందా లేదా అన్నది అటుంచితే ఆ క్షణం ఆ ఇద్దరి ఎక్స్ ప్రెషన్స్ వీక్షకుల్లో నవ్వులు పూయించింది. హనీ మెహ్రీన్ డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతున్నాయి.
`ఎఫ్ 2` 50రోజుల వేడుకలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ``పంపిణీ వర్గాలకు, ఎగ్జిబిటర్లకు ఇలా షీల్డ్స్ ఇవ్వడం చూసి చాలా ఏళ్లయ్యింది. మేం సినిమాలు చేసేటప్పుడు మాకిదే పెద్ద పండుగ అనిపించేది. మంచి సినిమాకు మంచి నిర్మాత అవసరం. ఈ సినిమాకు దిల్‌రాజు పెద్ద అండ. అతడు మంచి నిర్మాత, పంపిణీదారుడు.. థియేటర్ ఓనర్. అందుకే ఇంత పెద్ద సక్సెస్. ఎంత మంచి సినిమా చేసినా దిల్‌రాజు చేతిలో పడితేనే పెద్ద సక్సెస్ అవుతుంది. ఇక అనీల్ రావిపూడి సినిమా చూస్తే చాలు జిమ్‌కు వెళ్లనవసరం లేదు. అతడి సినిమాలు రెండు మూడు సార్లు చూస్తాను. నేను తీసిన సినిమాల్లో పెళ్ళిసందడి, గంగోత్రి సినిమాలు ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టాయి. వెంకటేష్ గత సినిమాల కంటే వంద రెట్లు ఎక్కువగా నవ్వించాడు. అలాగే వరుణ్ కూడా మంచి నటన కనపరిచాడు`` అన్నారు.