Begin typing your search above and press return to search.

మెహ్రీన్.. ఇట్స్ జాలీ టైమ్

By:  Tupaki Desk   |   25 Jan 2019 1:28 PM GMT
మెహ్రీన్.. ఇట్స్ జాలీ టైమ్
X
స‌క్సెస్ ఇచ్చే కిక్కు వేరుగా ఉంటుంది. ఎన్ని ప‌రాజ‌యాలు వ‌చ్చినా ఒకే ఒక్క హిట్టు మొత్తం భారం దించేస్తుంది. ప్ర‌స్తుతం అలాంటి స‌న్నివేశాన్నే ఎంజాయ్ చేస్తోంది మెహ్రీన్ కౌర్. ఈ పంజాబీ బ్యూటీ వ‌రుస‌గా ఎన్ని సినిమాలు చేసినా హిట్లు మాత్రం ముఖం చాటేసాయి. దీంతో కెరీర్ ప‌రంగా కొంత ఫ్ర‌స్టేష‌న్ త‌ప్ప‌లేదు. అప్ప‌ట్లో `రాజా ది గ్రేట్` బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టినా అందులో మెహ్రీన్ రోల్ కి అంత ప్రాధాన్య‌త లేద‌న్న మాట వినిపించింది. అయితే కొంత గ్యాప్ త‌ర్వాత మ‌రోసారి అనీల్ రావిపూడి ఇచ్చిన ఛాన్స్ ని ఈ బ్యూటీ స‌ద్వినియోగం చేసుకుంది. `ఎఫ్2 - ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్` చిత్రంలో మెహ్రీన్ యూత్ ఫుల్ పెర్ఫామెన్స్ కి పేరొచ్చింది. ఈ సినిమా ఏకంగా 100కోట్ల క్ల‌బ్ లో చేరింద‌ని నిర్మాత‌లు పోస్ట‌ర్ వేశారు.

అంటే ఇండ‌స్ట్రీ బెస్ట్ హిట్ సినిమా మెహ్రీన్ ఖాతాలోకి చేరిన‌ట్టే. సంక్రాంతి సినిమాల్లో వెంకీ- త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్- మెహ్రీన్ జంట‌లు అంతేగా అంతేగా అంటూ సైలెంట్ హిట్ కొట్టేయ‌డంపై ఇండ‌స్ట్రీలోనూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అందుకే ఈ ఆనందోత్సాహాన్ని కుటుంబ స‌మేతంగా సెల‌బ్రేట్ చేసుకునేందుకు ఈ బ్యూటీ ప్ర‌స్తుతం జాలీ ట్రిప్ లు వేస్తోంది. మెహ్రీన్ ఎంత‌టి హ్యాపీ మోడ్ లో ఉందో ఈ ఫోటో చెప్ప‌క‌నే చెబుతోంది. ఇట్స్ ఫ్యామిలీ టైమ్.. ట్రావెలింగ్ టైమ్ అంటూ సెల‌బ్రేష‌న్ మోడ్ లో ఉంది. త‌న లైఫ్ లో ఇంత‌టి ఆనందం ఇప్ప‌టివ‌ర‌కూ క‌లిగి ఉండ‌క‌పోవ‌చ్చు. హ‌ద్దు లేని ఆనందాన్ని ఈ బ్యూటీ ఆస్వాధిస్తోంది.

ఇక ఇదే ఉత్సాహంలో కొత్త ఏడాదిలో కెరీర్ ని మ‌రింత బెట‌ర్ గా ప్లాన్ చేసుకుంటుందేమో చూడాలి. మెహ్రీన్ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లోనూ దూసుకుపోయేందుకు ఈ హిట్టు కలిసొస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఇప్ప‌టికే కెఎల్ఎం షాపింగ్ మాల్ ప్ర‌మోట‌ర్ గా రాశిఖ‌న్నాతో క‌లిసి మెహ్రీన్ ప్ర‌క‌ట‌న‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇదిగో ఈ స్టిల్ లో అల్ట్రా మోడ్ర‌న్ డెనిమ్ డిజైన‌ర్ వేర్ లో మెహ్రీన్ లుక్ యూత్ ని మైమ‌రిపిస్తోంది.