Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: స‌న్ సెట్ లో మ‌త్తెక్కించే హొయ‌లు!

By:  Tupaki Desk   |   4 Nov 2022 5:30 PM GMT
ఫోటో స్టోరీ: స‌న్ సెట్ లో  మ‌త్తెక్కించే హొయ‌లు!
X
పంజాబీ బ్యూటీ మోహ‌రీన్ పిర్జాద టెంప్టింగ్ ఎలివేష‌న్ల‌ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బ్యూటీ ఇన్ స్టా వేదిక‌గా డిజైన‌ర్ దుస్తుల్లో నిత్యం హీటెక్కిస్తూనే ఉంటుంది. స్లిమ్ లుక్ లో కి ట్రాన్స‌ప‌ర్మేష‌న్ త‌ర్వాత గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్ లో మ‌రింత యాక్టివ్ గా పాల్గొంటుంది. ఫ్యాష‌న్ ఎంపికల్లో న‌వ్య‌పంథాని ప‌రిచ‌యం చేస్తుంది. స్క‌ర్స్ట్ నుంచి ఆల్ర్టా మోడ్ర‌న్ వ‌ర‌కూ ప్ర‌తీ డిజైన్ లోనూ త‌ళుక్కున మెరుస్తుంది.

తాజాగా అమ్మ‌డు సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ లో చూప‌రుల్ని ఆక‌ట్టుకుంది. ఇదిగో ఇక్క‌డిలా ప్లోర‌ల్ ఔట్ ఫిట్ లో పాల నురుగుల సౌంద‌ర్యంతో మురిపిస్తోంది. మ‌ల్టీక‌ల‌ర్ ఔట్ ఫిట్ అమ్మ‌డికి మ‌రింత వ‌న్నే తీసుకొచ్చింది. చేతిలో వైన్ గ్లాస్..కొంటె చూపుల కోనంగిలా కుర్రాళ్ల‌ని మ‌త్తెక్కించే చూపుల‌తో లాక్ చేస్తుంది. బ్యాక్ గ్రౌండ్ లో అంద‌మైన స‌ముద్రం.. సన్ సెట్స్ మెహ‌రీన్ స్ర్కిన్ టోన్ ని మ‌రింత ఎలివేట్ చేస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. మెహ‌రీన్ స్లిమ్ లుకి కుర్రాళ్లంతా పిదా అవుతున్నారు.

ఇక మెహ‌రీన్ స‌క్సెస్ ఫుల్ జ‌ర్నీ గురించి చె ప్పాల్సిన ప‌నిలేదు. నాని సినిమా కృష్ణ‌గాడి వీర ప్రేమ గాథ‌ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీకి అవ‌కాశాలు బాగానే వ‌రిస్తున్నాయి. ఇటీవ‌లే `ఎఫ్ -3` హిట్ తో మ‌రోసారి హానీ ఈజ్ ది బెస్ట్ అనిపించింది. అంత‌కు ముందు `మంచి రోజులొచ్చాయి` తో యావ‌రేజ్ స‌క్సెస్ ని ఖాతాలో వేసుకుంది.

`ఎఫ్-2` త‌ర్వాత అమ్మ‌డికి చెప్పుకోద‌గ్గ స‌క్సెస్ లేని నేప‌థ్యంలో ఈ రెండు విజ‌యాలు బూస్టింగ్ లా నిలిచాయి. ప్ర‌స్తుతం `స్పార్క్` అనే తెలుగు..త‌మిళ్ సినిమాలో న‌టిస్తుంది. అలాగే క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లోనూ లాంచ్ అవుతుంది. `నీ సిగ‌వొరుగు` అనే సినిమాతో శాండిల్ వుడ్ లో ప్రవేశిస్తుంది. ప్ర‌స్తుతానికి అమ్మ‌డి చేతిలో ఉన్న సినిమాలివే. తెలుగులో కొత్త అవ‌కాశాలేవి రాలేదు.

మెహ్రీన్ వ్య‌క్తిగ‌త విష‌యంలోకి వ‌స్తే.. రాజకీయ నేపథ్యం ఉన్న భవ్య బిష్ణోయ్ ని పెళ్లాడాలనుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇరు కుటుంబాల నడుమా సఖ్యత కుద‌ర‌లేదు. అతడి కుటుంబంతో చాలా కాలంగా మెహ్రీన్ కి ఆమె కుటుంబానికి సరిపడలేదని... కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలొచ్చి దూర‌మ‌య్యారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.