Begin typing your search above and press return to search.

ఒక రోజంతా మాట్లాడొద్దు అన్నాడు

By:  Tupaki Desk   |   14 Feb 2016 4:41 AM GMT
ఒక రోజంతా మాట్లాడొద్దు అన్నాడు
X
మెహ్రీన్‌ కౌర్‌ పీర్జాదా.. తొలి సినిమాతో చాలా మంది కొత్త హీరోయిన్లు హిట్లు కొట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ అమ్మడు మాత్రం సింపుల్‌ గా హిట్టు కొట్టేసింది. నాని తో కలసి ''కృష్ణగాడి వీర ప్రేమగాధ'' సినిమాతో టాలెంట్ ను బాగానే చూపించింది. అయితే ఈ సినిమా షూటింగులో.. తన క్యారెక్టర్ బాగా పండటానికి బాగానే కష్టపడిందట.

ఒకసారి హీరోయిన్‌ అన్నయ్య హీరో నానిని చంపేశాడేమో అనే సందేహం వస్తుంది సినిమాలో. అప్పుడు అమ్మడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి అసలు తన ప్రియుడికి ఏమైందో చూస్తోంది. ఆ సీన్‌ లో విపరీతమైన భావోద్వేగాలు పండించాలి. అందుకోసం అమ్మడుని అసలు కనీసం 2 డేస్‌ ఎవ్వరితో మట్లాడకూ అని చెప్పాడట దర్శకుడు హను రాఘవపూడి. ఇక మన మెహ్రీన్‌ కనీసం వాళ్ళ మమ్మీతో కూడా మాట్లాడలేదు. ఒక రోజంతా సైలెంట్‌ గానే ఉందట. అందుకే ఆ సీన్‌ లో ఎమోషన్‌ బాగా పండింది.. అంటోంది ఈ హీరోయిన్‌.

ఏదేమైనా మొదటి సినిమాతో హిట్టు కొట్టేసి.. ఇప్పుడు ఈ భామ ఎలాంటి ఆఫర్లు తన ఖాతాలో పడతాయోనని వేచి చూస్తోంది.