Begin typing your search above and press return to search.

వెయిట్ తగ్గకపోతే వెయిటింగేనా?

By:  Tupaki Desk   |   5 Dec 2017 1:42 AM GMT
వెయిట్ తగ్గకపోతే వెయిటింగేనా?
X
హీరోలు ఫిట్నెస్ లో ఎలా ఉన్నా వారి రెగ్యులర్ అభిమానులకు నచ్చుతుంది. 50 ఏళ్ల హీరోని కూడా పాతికేళ్ల కుర్రాడు అంటే ఓ వర్గం ప్రేక్షకులలో ఏ మాత్రం ఆలోచించరు. కానీ హీరోయిన్స్ విషయంలో అలా కాదు. ప్రతి సినిమాలో ఫిట్ నెస్ దగ్గరి నుంచి యాక్టింగ్ స్కిల్స్ వరకు రాటు దేలి ఉండాలి. అందం ఉంటే సరిపోదు. అందుకు తగ్గట్టుగా హవాబావాలని తెరపై ప్రదర్శిస్తేనే ఆ అందానికి అసలైన అర్ధం ఉంటుంది.

అందుకే చాలా మంది హీరోయిన్స్ వయసు ఎంత వచ్చినా కూడా ఫిట్నెస్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. ఇప్పటికి మూడు పదులు వయసు దాటినవారు కూడా 16 ఏళ్ల పడుచు హీరోయిన్స్ లా కనిపిస్తున్నారు. కానీ ఓ 22 ఏళ్ల పాప మాత్రం ఫిట్నెస్ పై ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. గత ఏడాది కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ అందరిని ఆకట్టుకుంది. దీంతో అమ్మడికి వరుస ఆఫర్లు అందాయి. ఈ ఏడాది వెంట వెంటనే నాలుగు సినిమాలను రిలీజ్ చేసింది. రాజా ది గ్రేట్ - మహానుభావుడు మంచి హిట్స్ ని ఇచ్చాయి. కానీ ఇంకా తెలుగు పదాలకు అమ్మడి హావభావాలు సెట్ అవ్వలేదు అనే కామెంట్స్ వస్తున్నాయి.

రెండు వరుస హిట్స్ అందుకుందో లేదో నెక్స్ట్ రిలీజ్ అయిన కేరాఫ్ సూర్యా - జవాన్ సినిమాలతో డిజాస్టర్స్ ని అందుకుంది. సినిమాలో అమ్మడు బొద్దుగా కనిపించి కొంచెం నెగిటివ్ టాక్ ను కూడా అందుకుంది. ఇక ఏడాది వరకు చేసిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు కొత్తగా గోపిచంద్ సినిమా తప్పించి ఆఫర్స్ ఏ మాత్రం రావడం లేదట. కనీసం వెయిట్ లాస్ అయితే ఏవైనా అవకాశాలు రావచ్చు అంటున్నారు సినిమా వర్గాలు. ఏమంటావ్ బేబి?