Begin typing your search above and press return to search.

మెహ్రీన్ చాలా తగ్గిందే!!

By:  Tupaki Desk   |   5 March 2018 5:31 AM GMT
మెహ్రీన్ చాలా తగ్గిందే!!
X
సినిమా ఇండస్ట్రీలో విజయాలు అందితేనే క్రేజ్ అయినా రెమ్యునరేషన్ అయినా గట్టిగా ఉంటుంది. కష్టకాలంలో ఉన్నప్పుడు అవకాశాలు ఎలా అయినా రప్పించుకోవచ్చు. కానీ రెమ్యునరేషన్ పై మాత్రం ఎక్కువగా ఆశలు పెట్టుకోకూడదు. ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. లేదంటే ఫ్రీ గా అయినా చేయాలి. ఎవ్వరికైనా కొన్ని సమయాల్లో ఇలాంటి తిప్పలు తప్పవు. రీసెంట్ గా అదే తరహాలో ఓ హీరోయిన్ పరిస్థితి మారిందని తెలుస్తోంది.

కృష్ణ గాడి వీర ప్రేమ కథ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నార్త్ గర్ల్ మెహ్రీన్ పిర్జాద. అమ్మడు వచ్చిన కొత్తలో ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. నవ్వుతోనే అందరిని ఆకర్షించింది. వరుసగా ఆఫర్స్ ని కూడా అందుకుంది. మహానుభావుడు - రాజా ది గ్రేట్ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకోవడంతో అందరు తిరుగులేదు అనుకున్నారు. కానీ వెంటనే మెహ్రిన్ ఖాతాలో హ్యాట్రిక్ పరాజయాలు కూడా కొనసాగడం మొదలయ్యాయి. కేరాఫ్ సూర్యా తెలుగు తమిళ్ లో డిజాస్టర్ అయ్యింది. జవాన్ అయితే ఏ మాత్రం లాభాన్ని ఇవ్వలేదు.

దీంతో మెహ్రీన్ పరిస్థితిని అర్ధం చేసుకొని తనకు తానే సరికొత్త దారిని ఎందుకుంది. ఇలాంటి టైమ్ లో రెమ్యునరేషన్ విషయంలో తగ్గాల్సిందే అని కేవలం అవకాశాల కోసమే ఆలోచిస్తోందట. కథ బాగా నచ్చితే రెమ్యునరేషన్ లెక్కలను పట్టించుకోవడం లేదట. కేవలం 20 లక్షలు మాత్రమే ఇవ్వమని అంటోందని టాక్. కానీ ప్రియా వారియర్ లాంటి లేటెస్ట్ ముద్దు గుమ్మాలు మాత్రం మొదటి 50 లక్షల వరకు లాగేస్తున్నారు. మెహ్రీన్ మాత్రం సినిమాకు తగ్గట్టు చాలా వరకు రెమ్యునరేషన్ ని తగ్గించేస్తోందట. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో అలాగే జ్ఞాన్ వెల్ రాజ్ ప్రొడక్షన్ లో ఈ భామ సినిమాలు చేస్తోంది.