Begin typing your search above and press return to search.

మెహ్రీన్ నో చెప్పింది అందుకేనా?

By:  Tupaki Desk   |   27 Nov 2018 7:12 AM GMT
మెహ్రీన్ నో చెప్పింది అందుకేనా?
X
నాని కృష్ణగాడి వీర ప్రేమగాధతో పరిచయమైన బ్యూటీ మెహ్రీన్ కు ఆ తర్వాత రెండేళ్ళకు గాని కోరుకున్న బ్రేక్ దక్కలేదు. రాజా ది గ్రేట్ లో రవితేజ లాంటి సీనియర్ హీరోతో మహానుభావుడులో శర్వానంద్ లాంటి యూత్ స్టార్ తో ఒకేసారి హిట్స్ కొట్టడంతో టాప్ లీగ్ లోకి దూసుకుపోవడం ఖాయంగా కనిపించింది. కాని ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేక వరస పరాజయాలు పలకరించడం మొదలుపెట్టాయి. సందీప్ కిషన్ కేరాఫ్ సూర్యతో మొదలై గోపీచంద్ పంతం దాకా ఈ ఫ్లో కొనసాగుతూనే ఉంది. కాకపోతే లక్కీగా చెప్పుకోదగ్గ ఆఫర్స్ అయితే వస్తున్నాయి.

తాజాగా మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పులివాసు దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో నటించేందుకు నో చెప్పిందన్న గాసిప్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. దీని వెనుక మరో ఆసక్తికరమైన కోణం ఉందట. నిజానికి ఇది సుధీర్ బాబుతో రూపొందాల్సిన సినిమా. మెహ్రీన్ జంటగా నటించేందుకు ఒప్పుకుని 30 లక్షల రెమ్యునరేషన్ మీద అడ్వాన్సు కూడా తీసుకుంది. కాని సుధీర్ బాబు ఏవో కారణాల వల్ల అందులో నుంచి బయటికి వచ్చేసాడు. అది కాస్తా కళ్యాణ్ దేవ్ ని చేరింది. ఇప్పుడు మెహ్రీన్ ఈ ప్రాజెక్ట్ చేయలేను అని చెప్పి అడ్వాన్సు వెనక్కు ఇవ్వడానికి రెడీ అయ్యిందట.

ఇది ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిన గాసిప్ న్యూస్. కళ్యాణ్ దేవ్ హీరో అన్నందుకు నో చెప్పిందా లేక ఇంకా బెటర్ ఆఫర్స్ ఏమైనా తలుపు తట్టాయా అనేది తెలియడం లేదు. వరుణ్ తేజ్ సరసన చేసిన ఎఫ్2 మీద తనకు చాలా నమ్మకం ఉంది. దిల్ రాజు నిర్మాణం అనిల్ రావిపూడి దర్శకత్వం కాబట్టి ఖచ్చితంగా బ్రేక్ దొరుకుంది అనే నమ్మకంతో ఉంది.ఈ క్రేజీ మల్టీ స్టారర్ సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేసారు.