Begin typing your search above and press return to search.
'గీత' గోవిందం సెంటిమెంట్ తో అల్లు హీరో
By: Tupaki Desk | 21 Feb 2019 5:23 AM GMTమెగా హీరో బ్రాండ్ ఉన్నా కూడా అల్లు శిరీష్ ఆశించిన స్థాయిలో స్టార్ డం దక్కించుకోవడంలో విఫలం అవుతున్నాడు. హీరోగా ఇప్పటికే పలు చిత్రాల్లో నటించినా కూడా ఏ ఒక్కటి ఈయనకు స్టార్ డంను తెచ్చి పెట్టలేక పోయాయి. అయినా కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా మలయాళ సూపర్ హిట్ మూవీని 'ఏబీసీడీ' టైటిల్ తో రీమేక్ చేశాడు. వచ్చే నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. ఈ చిత్రంకు సంబంధించిన ఒక పాటను విడుదల చేశారు.
మెల్ల మెల్లగా.. అంటూ సాగే ఈ పాటను సిడ్ శ్రీరామ్ పాడాడు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సిడ్ శ్రీరామ్ మంచి క్రేజ్ ఉన్న సింగర్. టాలీవుడ్ లో హిట్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ అయిన సిడ్ శ్రీరామ్ 'గీత గోవిందం' చిత్రంలో సూపర్ హిట్ సాంగ్ ఇంకేం ఇంకే కావాలే... పాటను పాడిన విషయం తెల్సిందే. ఆ పాట సూపర్ హిట్ అవ్వడంతో పాటు, సినిమాకు ముందు విడుదల అవ్వడం వల్ల సినిమాపై అంచనాలు భారీగా పెరిగేలా చేసింది. అందుకే ఏబీసీడీ చిత్రానికి కూడా అదే సెంటిమెంట్ ను వర్కౌట్ చేయాలని భావించారు.
సిడ్ శ్రీరామ్ పాడిన పాటతో ఏబీసీడీ సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించి సినిమాపై అందరి దృష్టి పడేలా చేయాలని భావించారు. అయితే మెల్ల మెల్లగా.. పాట లిరిక్స్ క్యాచీగా లేకపోవడంతో పాటు గీత గోవిందంలోని ఇంకేం ఇంకే కావాలే.. పాట స్థాయిలో ట్యూన్ లేదు. దాంతో ఏబీసీడీ సినిమాకు అంతగా ఈ పాట హెల్ప్ అవ్వడం లేదని చెప్పాలి. నిన్న విడుదలైన ఈ పాట ఇంకా కనీసం లక్ష వ్యూస్ ను కూడా దక్కించుకోలేక పోయింది.