Begin typing your search above and press return to search.
మీమ్ : కేజీఎఫ్ 2 డైలాగ్ ను వాడేసిన టీ పోలీసులు
By: Tupaki Desk | 9 April 2022 10:39 AM GMTఈమద్య కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది. ఇతర మీడియాల ద్వారా చెప్పాలనుకున్న మెసేజ్ ను సోషల్ మీడియా ద్వారా చెప్పడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. పైగా ఒక మీమ్ రూపంలో లేదంటే ఫన్నీ ఇమేజ్ రూపంలో ఆ మెసేజ్ ను షేర్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని ఇప్పటికే నిరూపితం అయ్యింది. అందుకే తెలంగాణ పోలీస్ వారు సోషల్ మీడియాను ఫుల్ గా వాడేస్తున్నారు.
హైదరాబాద్ పోలీసులు మరియు తెలంగాణ పోలీసులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రాఫిక్ రూల్స్ మరియు ఇతర విషయాలకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా యువత ట్రాఫిక్ రూల్స్ విషయంలో అస్సలు జాగ్రత్తలు పాటించడం లేదు. దాంతో సోషల్ మీడియాలో వారిని టార్గెట్ చేసుకుని పోస్ట్ లు చేయడం మొదలు పెట్టారు. ఎక్కువగా ట్రాఫిక్ రూల్స్ కు సంబంధించిన పోస్ట్ లు ఉంటున్నాయి.
ట్రాఫిక్ రూల్స్ ను సినిమా పోస్టర్ ల ద్వారా ప్రచారం చేయడం ఈమద్య కాలంలో కామన్ అయ్యింది. అప్పుడు పుష్ప.. రాధేశ్యామ్.. ఆ తర్వాత ఆర్ ఆర్ ఆర్.. ఇప్పుడు కేజీఎఫ్ 2 ఇలా ఫేమస్ సినిమా లను పోలీసు వారు ఉపయోగించుకుంటున్నారు. ఆర్టీసీ మరియు పోలీసు వారు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న మీమ్స్ సందేశాత్మకంగా ఉండటంతో పాటు వినోదాత్మకంగా కూడా ఉంటున్నాయని కామెంట్స్ వస్తున్నాయి.
తాజాగా కేజీఎఫ్ 2 లోని యశ్ డైలాగ్ వయలెన్స్.. వయలెన్స్... ఐ డోంట్ లైక్ ఇట్.. ఐ అవాయిడ్.. బట్ వయలెన్స్ లైక్స్ మీ అంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ డైలాగ్ ను హైదరాబాద్ ట్రాఫిక్ వారు తమకు అనుకూలంగా మార్చుకున్నారు.. హెల్మెట్.. హెల్మెట్.. హెల్మెట్.. ఐ డోంట్ లైక్ ఇట్.. బట్ హెల్మెట్ సేవ్స్ మై లైవ్ అంటూ ఉన్న మీమ్ ను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
ఇక కేజీఎఫ్ 2 సినిమా విషయానికి వస్తే యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ 2 సినిమాను వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రంగం సిద్దం అయ్యింది.
భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయి లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు సర్వం సిద్దం అయ్యింది. ఈ సినిమా ఓపెనింగ్ వసూళ్లు భారీగా ఉంటాయని అంతా నమ్మకంగా ఉన్నారు.