Begin typing your search above and press return to search.
మెగాస్టార్ మళ్లీ స్లిప్పయ్యాడు.. మీమర్స్ గట్టిగా పట్టేసుకున్నారు!
By: Tupaki Desk | 20 March 2021 5:30 PM GMTచిరంజీవి వేదికపై ఎంత పద్ధతిగా మాట్లాడుతారో అందరికీ తెలిసిందే. అందరినీ గుర్తు పెట్టుకొని, అన్ని విషయాలనూ ప్రస్తావిస్తూ ప్రసంగం కొనసాగిస్తారు. అయితే.. తాను ఎవరి గురించైతే మాట్లాడుతుంటారో.. వారిని మరింతగా అభినందించేందుకు చేసే ప్రయత్నంలో ఒక్కోసారి స్లిప్పవుతుంటారు. ఆ క్రమంలో సినిమాలకు సంబంధించిన సీక్రెట్ విషయాలను కూడా తనకు తెలియకుండానే చెప్పేస్తుంటారు.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన అప్ కమింగ్ మూవీ ‘ఆచార్య’ టైటిల్ ను అధికారికంగా వెల్లడించకముందే ఓ ప్రసంగంలో లీక్ చేసేశారు చిరు. ఆ తర్వాత మొన్న ఉప్పెన ఫంక్షన్లో తాను మైత్రీ మూవీస్ బ్యానర్లో సినిమా చేయబోతున్నట్టు అనుకోకుండా రివీల్ చేశారు.
తాజాగా.. విరాటపర్వం సినిమా టీజర్ ను చిరంజీవి లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి మాట్లాడుతూ.. తన సినిమాలోని ఓ సీక్రెట్ ను బయటపెట్టేశారు. విరాటపర్వం నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందన్న సంగతి అందరికీ తెలిసిందే. టీజర్ ద్వారా ఫుల్లుగా అనౌన్స్ చేశాడు దర్శకుడు.
అయితే.. ఆచార్య సినిమాలో కూడా నక్సలైట్ బ్యాక్ డ్రాప్ ఉందని అనుకోకుండానే చెప్పేశారు చిరు. ఈ మధ్య కాలంలో వచ్చే నక్సలింజ బ్యాక్ డ్రాప్ సినిమా తనదే అనుకున్నానని, కానీ.. విరాట పర్వం కూడా ఉందని అన్నారు. ఈ బ్యాక్ డ్రాప్ ను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తే.. తన చిత్రం కూడా విజయవంతం అవుతుందని అన్నారు.
కాగా.. ప్రతీ దర్శకుడు తన సినిమాకు సంబంధించిన పలు కీలక విషయాలను రిలీజ్ అయ్యే వరకూ రహస్యంగానే ఉంచుతారు. కానీ.. చిరు మాత్రం ఆచార్యకు సంబంధించిన ఒక్కో విషయం అనుకోకుండా బయటపెడుతున్నారు. దీనిపై మీమర్స్ వెంటనే మీమ్స్ మొదలెట్టేశారు.
పైన పిక్ లో చిరు మాట్లాడుతూ ‘నెక్స్ట్ రాబోయే నా ఆచార్య కూడా నక్సలిజం బ్యాగ్రౌండ్ సినిమానే’ అని అంటుండగా.. కింద జల్సాలో బ్రహ్మీ ఏడుస్తున్న పిక్ ను పెట్టి ‘నీయవ్వ.. స్టోరీ అంతా లీక్ చేసి పడేస్తున్నాడు’ అని కొరటాల అన్నట్టుగా మీమ్ క్రియేట్ చేశారు. మరో మీమ్ లో ఇదే చిరు డైలాగ్ కు.. కొరటాల రియాక్షన్ ఇదంటూ.. బ్రహ్మీ నెత్తి బాదుకుంటున్న పిక్ పెట్టారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.