Begin typing your search above and press return to search.
నెట్టింట రోహిత్ శెట్టికి సర్కస్ చూపిస్తున్నారు!
By: Tupaki Desk | 26 Dec 2022 11:18 AM GMT'సర్కస్' రూపంలో బాలీవుడ్ కు మరో భారీ డిజాస్టర్ తగిలింది. గత కొంత కాలంగా స్టార్ హీరోలు నటిస్తున్న పలు క్రేజీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తున్నాయి. ఎంత పెద్ద క్రేజీ స్టార్ సినిమా అయినా సరే విషయం లేకపోవడంతో ప్రేక్షకులు నిర్మొహమాటంగా రిజెక్ట్ చేస్తున్నారు. దీంతో ఈ మధ్య కాలంలో స్టార్స్ నటించిన ప్రతి సినిమా డిజాస్టర్ గా నిలుస్తూ వరుసగా షాక్ ఇస్తున్నాయి. ఈ నేఫథ్యంలో రీసెంట్ గా విడుదలైన 'దృశ్యం 2' బాలీవుడ్ ఆశలకు రెక్కలు తొడిగింది. భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది.
దీంతో ఈ మూవీ తరువాత అందరి దృష్టి రణ్ వీర్ సింగ్ నటించిన 'సర్కస్'పై పడింది. హిట్ మెషీన్ గా పేరున్న రోహిత్ శెట్టి ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. షేక్స్పీయర్ ఫేమస్ నవల 'ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్' నవల ఆధారంగా ఈ సినిమాని రూపొందించాడు. పీరియాడిక్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీలో రణ్ వీర్ సింగ్ డ్యుయెల్ రోల్ లో నటించగా, బుట్టబొమ్మ పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ లుగా నటించారు.
ఈ శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైన 'సర్కస్' బిగ్ డిజాస్టర్ అనిపించుకుంది. ఏ విషయంలోనూ సినిఆ ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. అత్యంత భారీ బడ్జెట్ తో భారీ హంగులతో నిర్మించిన ఈ మూవీ ఓపెనింగ్ డే కేవలం రూ. 6 కోట్లు మాత్రమే రాబట్టి డిజాస్టర్ కా బాప్ అనిపించుకుంది. ఈ సినిమాపై, దర్శకుడు రోహిత్ శెట్టిపై నెట్టింట మీమ్స్ ఓ రేంజ్ లో పేలుతున్నాయి.
టైటిల్ ని స్పెల్లింగ్ మిస్టేక్ తో మొదలు పెట్టి తొలి తప్పు చేశావని, అప్పుడే సినిమా ఫలితం తేలిపోయిందని రోహిత్ శెట్టిని నెటిజన్ లు ట్రోల్ చేస్తూ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. రణ్ వీర్ కు 'జయేష్ భాయ్ జోర్దార్' తరువాత 'సర్కస్'తో మరో డిజాస్టర్ ఎదురైందని కామెంట్ లు చేస్తున్నారు. ఇలాంటి సినిమాని రణ్ వీర్ సింగ్ ఎందుకు చేశాడో అర్థం కాంవడం లేదని. థియేటర్లలో సర్కస్ చేడాలని వెళ్లి మైగ్రైన్ తో ఇంటికి వెళుతున్నామని మీమ్స్ తో ఆడుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.