Begin typing your search above and press return to search.
ఓ సెల్ ఫోన్ MEMES ట్రెండింగ్
By: Tupaki Desk | 14 Sep 2018 1:46 PM GMTనచ్చితే పిచ్చిగా ఏదైనా పాపులర్ చేయడం యూత్‌కి అలవాటు. ఇటీవలే కికి ఛాలెంజ్ అటూ కార్ లోంచి నడిరోడ్డులో దూకి ప్రమాదాల్ని కొని తెచ్చుకున్నారు. బకెట్ ఛాలెంజ్ - హరితహారం ఛాలెంజ్ అంతే గొప్పగా పాపులర్ అవ్వడంలో యువతరం పాత్రను విస్మరించలేం. ఇది ఆ తరహా కాదు .. కాస్త విలక్షణమైనది. ఏదైనా సినిమాలో ఒక సీన్ లేదా డైలాగ్ లేదా ఎక్స్ ప్రెషన్ తమకు పిచ్చిగా నచ్చేస్తే యూత్ దానిని పిచ్చిగా మైమ్ లేదా మీమ్స్ చేస్తుంటుంది. ఆ మైమ్ వీడియోని పదే పదే MEMES పేరుతో రిపీటెడ్ గా వీడియోల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడాన్ని చూస్తున్నాం.
రీసెంటుగానే అనుష్క శర్మ `క్రైయింగ్ మామ` లుక్‌ని మీమ్స్ చేశారు. అనుష్క `సుయ్ ధాగ` చిత్రం కోసం రకరకాల గెటప్పుల్లో దర్శనమిచ్చి రకరకాల ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటే.. దానికి ప్రతిగా యూత్ మీమ్స్ ని సామాజిక మాధ్యమాల్లో పాపులర్ చేశారు. అనుష్క శర్మ ఎక్స్ ప్రెషన్స్ తో బోలెడంత ఫన్ క్రియేట్ చేశారు.
ఇప్పుడు అదే తీరుగా శంకర్ `2.ఓ` టీజర్ లోని సెల్ ఫోన్స్ గాల్లో లేచి మాయమైపోయే సీన్ ని మీమ్స్ చేయడం చర్చకొచ్చింది. ఆ సీన్ లో న్యూస్ 7 చానెల్ యాంకర్ ఆ వార్తను ఎంతో ఆసక్తికరంగా బ్రేకింగ్ ఇస్తుంటే.. దానిని మీమ్స్ చేసి ఆ వీడియోని సామాజిక మాధ్యమాల్లో పాపులర్ చేస్తున్నారు. మీమ్స్ చేసేంతగా ఆకర్షించింది అంటే అందులో సంథింగ్ ఏదో ఉందనే అర్థం చేసుకోవాలి. ఆ ఎక్స్ ప్రెషన్ - సీన్ లేదా డైలాగుకి - అందులో ఆర్టిస్టులకు కొత్త తరహా పాపులారిటీ వస్తుందనడంలో సందేహం లేదు. ఇక `మైమ్` ఆర్ట్‌తో పోలిస్తే `మీమ్` ఆర్ట్ అనేది డిఫరెంట్ అని ఈ తరహా వీడియోలు చూసి తెలుసుకోవచ్చు.