Begin typing your search above and press return to search.

మీమ్స్ ప్ర‌చారంతో క‌లిసొచ్చేదెంత‌?

By:  Tupaki Desk   |   24 Oct 2019 7:48 AM GMT
మీమ్స్ ప్ర‌చారంతో క‌లిసొచ్చేదెంత‌?
X
ఒక్కో సీజ‌న్ లో ఒక్కో పిచ్చి. ఒక్కో ట్రెండ్ ఇలా వ‌చ్చి అలా వెళుతుంటుంది. ఫేస్ బుక్ ఒక ట్రెండ్. ఆ త‌ర్వాత ట్విట్ట‌ర్.. ఇన్ స్టా.. టిక్ టాక్ అంటూ బోలెడ‌న్ని ట్రెండ్స్ వ‌చ్చాయి. ఇవ‌న్నీ యువ‌త‌రానికి చేరువ కావ‌డంతో అక్క‌డ ఏ ఉత్ప‌త్తికి ప్ర‌చారం చేసినా వేగంగా దూసుకుపోతుంద‌ని కార్పొరెట్ న‌మ్ముతోంది. ఇప్పుడు ఇదే వెల్లువ‌లో వ‌చ్చిన‌దే మీమ్ ప్ర‌మోష‌న్.

అస‌లు మీమ్ తో సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌చారం చేస్తే క‌లిసొచ్చేదెంత‌? అన్న‌ది ఆరాతీస్తే ఇదేదీ సినిమాల‌కు క‌లిసొచ్చేది కాద‌ని తేలింది. ఒక్కో మీమ్ ని పోస్ట్ చేసినందుకు స‌ద‌రు సెల‌బ్రిటీలు భారీగా ఫాలోవ‌ర్స్ ఉన్న వాళ్లు బోలెడంత ఛార్జ్ చేస్తున్నారు. ఒక మీమ్ కి కొంద‌రు అయితే రూ.9000 దాకా వ‌సూలు చేస్తున్నార‌ట‌. మ‌రికొంద‌రు ల‌క్ష‌ల్లో వ‌సూలు చేస్తున్నారు. సోష‌ల్ మీడియా ప్ర‌భావం తో ఎఫ్ బీ.. ఇన్ స్టాలో ఉన్న కొన్ని పేజీల్ని ఇలా కేటాయించి వాటికి అంత డ‌బ్బు ఛార్జ్ చేస్తున్నార‌ట‌.

ఇవే సినిమాల‌కు విప‌రీతంగా బ‌జ్ తెస్తున్నాయ‌ని న‌మ్ముతున్న నిర్మాత‌లు.. హీరోలు వేలం వెర్రిగా మీమ్స్ పై దృష్టి పెడుతున్నారని స‌ర్వేలో తేలింది. మీమ్స్ యూత్ లో ప‌బ్లిసిటీకి ప‌నికొస్తుంద‌ని వాళ్లు న‌మ్ముతున్నారు. దీంతో మీమ్ పేజీల‌కు డిమాండ్ పెరిగింది. సోష‌ల్ మీడియాల్లో బాగా ఫాలోవ‌ర్స్ ఉన్న వాళ్లు అయితే మీమ్స్ పోస్టింగుల‌కు ఏకంగా వేల‌ల్లో మొద‌లై ల‌క్ష‌ల్లో గుంజేస్తున్నారు. కొంద‌రైతే రూ.4ల‌క్ష‌లు వ‌ర‌కూ డిమాండ్ చేస్తున్నార‌ట‌. అయితే ఇది శాస్త్రీయ‌మేన ప‌బ్లిసిటీ స్టంటా? అంటే సందేహ‌మే. మీమ్ ప్ర‌చారం తాత్కాలికం. ఇవి టిక్కెట్లు తెంచే సాధ‌నం కాదు. బ‌జ్ అనూహ్యంగా వ‌చ్చేయ‌దు. ఇది పూర్తిగా రాంగ్ క్యాలిక్యులేష‌న్ అని హీరోలు- నిర్మాత‌లు గ్ర‌హించాల్సి ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.