Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ: ‘మేము’
By: Tupaki Desk | 8 July 2016 12:19 PM GMTచిత్రం : ‘మేము’
నటీనటులు: సూర్య - అమలా పాల్ - మాస్టర్ నిశేష్ - బేబీ వైష్ణవి - బిందుమాధవి - కార్తీక్ కుమార్ - విద్య - రామ్ దాస్ తదితరులు
సంగీతం: అరోల్ కొరెలి
ఛాయాగ్రహణం: బాలసుబ్రమణ్యం
మాటలు: శశాంక్ వెన్నెలకంటి
నిర్మాత: జూలకంటి మధుసూదన్ రెడ్డి
రచన - దర్శకత్వం: పాండిరాజ్
మేము.. గత ఏడాదే విడుదల కావాల్సిన సినిమా. అనివార్య కారణాల వల్ల చాలాసార్లు వాయిదా పడి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళంలో సూర్య ప్రత్యేక పాత్ర పోషించడంతో పాటు స్వయంగా నిర్మించిన సినిమా ఇది. మరి సూర్యను అంతగా ఇన్ స్పైర్ చేసేంత ప్రత్యేకత ఈ చిత్రంలో ఏముందో చూద్దాం పదండి.
కథ:
నైనా (బేబి వైష్ణవి).. నవీన్ (మాస్టర్ నిశేష్).. అల్లరి పిల్లలు. ఇద్దరికీ చదువు మీద ధ్యాస ఉండదు. ఆటలంటేనే ఇష్టం. హైపర్ యాక్టివ్ అయిన వీళ్లిద్దరూ వారి తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పిగా తయారవుతారు. స్కూల్లో వీళ్ల అల్లరిని ఉపాధ్యాయులు భరించలేకపోతారు. దీంతో ఓ స్కూల్లో చేర్చడం.. అక్కడి మేనేజ్మెంట్ టీసీ ఇచ్చి పంపించేయడం.. ఇలా సాగుతుంటుంది వరస. చివరికి వీళ్ల అల్లరిని భరించలేక హాస్టల్లో చేర్చేస్తారు వాళ్ల తల్లిదండ్రులు. హాస్టల్లో ఉండటం వాళ్లిద్దరికీ ఏమాత్రం ఇష్టం లేకపోయినా.. తల్లిదండ్రులు వినిపించుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో చైల్డ్ సైక్రియాట్రిస్ట్ అయిన రామనాథం (సూర్య) ఆ పిల్లల మనస్తత్వాల్ని అర్థం చేసుకుని వాళ్లను దారిలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. అలాగే వారి తల్లిదండ్రుల్లోనూ మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తాడు.. అతడి ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిచ్చిందన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
‘మేము’ కథ విన్నా.. దీని ప్రోమోస్ చూసినా.. అమీర్ ఖాన్ స్వీయ దర్శకత్వంలో హిందీలో రూపొందించిన ‘తారే జమీన్ పర్’ గుర్తుకు రావడం సహజం. సినిమా చూస్తున్నంత సేపూ కూడా ఆ సినిమానే తలపుల్లోకి వస్తుంది. కథతో పాటు.. పాత్రలు చూసినా ‘తారే జమీన్ పర్’తో చాలా పోలికలు కనిపిస్తాయి. ‘తారే జమీన్ పర్’లో ఒక పిల్లాడుంటే.. ఇందులో ఇద్దరు పిల్లలు. అక్కడా.. ఇక్కడా రెండు చోట్లా తల్లిదండ్రులకు పిల్లల మనస్తత్వాలేంటన్నది అర్థం కావు. ఉపాధ్యాయులూ అర్థం చేసుకోరు. అక్కడ పరిస్థితిని చక్కదిద్దడానికి అమీర్ ఖాన్ వస్తాడు. ఇక్కడ సూర్య రంగంలోకి దిగుతాడు.
‘మేము’ కథాకథనాలు దాదాపుగా ‘తారే..’ తరహాలోనే సాగుతాయి. ఐతే పోలికలు ఉన్నా.. అమీర్ సినిమాలాగే ఇది కూడా చాలా మంచి ప్రయత్నమే. ఇప్పటికే తల్లిదండ్రులైన వాళ్లు.. భవిష్యత్తులో కావాల్సిన వాళ్లు చూడాల్సిన సినిమా ఇది. చూస్తున్నంతసేపూ ఇది మన కథ లాగే అనిపిస్తుంది. ఇందులోని పాత్రలతో కనెక్టవుతాం. కొన్ని చోట్ల అసహనానికి గురవుతాం.. కొన్నిచోట్ల భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటాం.. కొన్ని చోట్ల సంతోషంతో నవ్వుకుంటాం.. ఇందులోని సూర్య-పాండిరాజ్ కలిసి చెప్పాలనుకున్న విషయాలు యూనివర్శల్. ఇది బేసిగ్గా తమిళ సినిమా అయినా.. తమిళ నటులున్నా.. కొన్ని చోట్ల తమిళ వాసనలు కొట్టినా.. ఇందులో చెప్పాలనుకున్న అంశాలతో మాత్రం తెలుగు ప్రేక్షకులు కూడా కనెక్టవుతారు.
ప్రస్తుత విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో.. మార్కులే ప్రామాణికంగా చదువులు ఎలా సాగుతున్నాయో.. పిల్లల మనస్తత్వాల్ని.. వారి అభిరుచుల్ని అర్థం చేసుకోకుండా తల్లిదండ్రులు తమ ఆలోచనల్ని వారిపై రుద్డడానికి ఎలా ప్రయత్నిస్తున్నారో.. ఈ క్రమంలో పిల్లలు ఎంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారో.. స్వేచ్ఛాయుత వాతావరణం లేక పిల్లలు ఎలా బందీలుగా మారిపోతున్నారో.. పిల్లల విషయంలో తల్లిదండ్రుల సంఘర్షణ ఎలా ఉంటోందో.. అర్థవంతంగా చెప్పారు ‘మేము’లో. అలాగని ఇదేమీ డాక్యుమెంటరీ తరహాలో ఉండదు. చాలా విషయాల్ని లెక్చర్ లాగా కాకుండా.. వినోదాత్మకంగానే చెప్పే ప్రయత్నం జరిగింది.
సూర్య కోసమే ఈ సినిమాకు వెళ్లాల్సిన పని లేదు. నిజానికి సూర్య పాత్ర వచ్చాకే సినిమా కొంచెం నెమ్మదిస్తుంది. దాని కంటే ముందు ప్రథమార్ధాన్ని పిల్లల పాత్రలే నడిపిస్తాయి. ఆ రెండు పాత్రలతో చాలా త్వరగా కనెక్టయిపోతాం. తల్లిదండ్రుల పాత్రల్లోకి మారిపోయి.. కొన్నిసార్లు వాళ్ల అల్లరిని ఆస్వాదిస్తాం. అల్లరి శ్రుతిమించినపుడు అసహనానికి గురవుతాం. వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోకుండా మిగతా పాత్రలు ప్రవర్తిస్తుంటే నొచ్చుకుంటాం. సినిమాలో చాలా సన్నివేశాలు మనం చూసినవి.. విన్నవి.. మన అనుభవంలోకి వచ్చేవే. పిల్లల పెంపకం విషయంలో ఎన్నో మంచి విషయాల్ని ఆలోచన రేకెత్తించేలా.. ప్రభావవంతంగా చెప్పడంలో పాండిరాజ్ విజయవంతమయ్యాడు.
ఐతే ‘మేము’తో ఉన్న ప్రధాన ఇబ్బందేంటంటే.. కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది. వినోదం ఎక్కువ ఆశించలేం. కథలో సగటు ప్రేక్షకుడు ఆశించే మలుపులేమీ ఉండవు. పైగా అంతా అంచనాలకు తగ్గట్లే సాగుతుంది. ఏం జరగొచ్చు అనే విషయంలో సస్పెన్సేమీ లేదు. ద్వితీయార్ధంలో కథనం మరీ నెమ్మదించిన భావన కలుగుతుంది. అక్కడక్కడా తమిళ నేటివిటీ ఇబ్బంది పెడుతుంది. అసలే ‘తారే జమీన్ పర్’తో పోలికలుండగా.. ఆ సినిమా చూడని ప్రేక్షకుడు సైతం కథనం ఎలా సాగుతుందో ఈజీగా అంచనా వేసేస్తాడు. కథనం చాలా ప్లెయిన్ గా సాగిపోతుంది. ఆల్రెడీ ‘తారే జమీన్ పర్’ చూసిన వాళ్లకైతే వేరే నటీనటులతో ఆ సినిమానే మళ్లీ చూస్తున్న భావన కలుగుతుంది. ఆ సినిమాతో పోల్చుకుంటే ఆ స్థాయి ఎమోషన్ ఇందులో ఉండదు.
పతాక సన్నివేశాల్ని దర్శకుడు బాగానే మలిచాడు కానీ.. మరింత ఎమోషన్ ఆశిస్తాం. పతాక సన్నివేశాన్ని ముగించిన తీరు ఆకట్టుకుంటుంది. డబ్బున్న వాడే అయినా.. వెళ్లిన చోటల్లా ఏదో ఒకటి కొట్టుకొచ్చేసే విలక్షణమైన పాత్రలో రామ్ దాస్ పండించిన వినోదం సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది. నరేషన్ మరీ నెమ్మదిగా సాగే.. ఈ సినిమాకు ఈ పాత్ర అందించే వినోదం ప్లస్. ఇలాంటి వినోదం మరింత జోడించి ఉంటే.. ‘మేము’ మరింత ఎఫెక్టివ్ గా ఉండేది.
నటీనటులు:
సూర్య పాత్ర సగం సినిమా వరకే ఉన్నా పూర్తిగా ఆకట్టుకుంటుంది. పాత్రకు తగ్గట్లుగా అద్భుతంగా నటించాడతను. అమలా పాల్ కూడా చక్కగా నటించింది. ఐతే సినిమాకు ప్రధాన ఆకర్షణ మాత్రం ప్రధాన పాత్రలు పోషించిన పిల్లలు నిశేష్-వైష్ణవిలే. ఆ పిల్లలిద్దరూ నవ్విస్తారు. ఏడిపిస్తారు. థియేటర్ నుంచి వచ్చాక కూడా గుర్తుండిపోతారు. తల్లిదండ్రుల పాత్రల్లో కార్తీక్ - బిందుమాధవి.. రాందాస్-విద్య కూడా బాగా చేశారు. ముఖ్యంగా రాందాస్ పాత్ర భలేగా పండింది. అతను చాలా బాగా నటించాడు. మిగతా వాళ్లందరూ ఓకే.
సాంకేతిక వర్గం:
సంగీతం.. ఛాయాగ్రహణం సినిమాకు తగ్గట్లుగా బాగా కుదిరాయి. డబ్బింగ్ పాటలు కావడం వల్ల అంతగా కనెక్టవ్వలేం. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. ఛాయాగ్రహణం కూడా పర్ఫెక్ట్. కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్నిస్తుందని ఆలోచించుకుండా ఓ మంచి సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చిన సూర్యను అభినందించాలి. నిర్మాణ విలువల విషయంలో అతనేమాత్రం రాజీ పడలేదు. సినిమా చాలా రిచ్ గా తెరకెక్కింది. పాండిరాజ్ ఎంచుకున్న కథాంశం గొప్పది. ఇలాంటి అంశాల్ని సినిమాటిగ్గా చెప్పడం.. ప్రేక్షకులకు కనెక్ట్ చేయడం.. మెప్పించడం అంత సులువైన విషయం కాదు. అందులో పాండిరాజ్ చాలా వరకు విజయవంతమయ్యాడు. ఐతే కథనాన్ని అతను మరింత ఆసక్తికరంగా.. వేగవంతంగా తీర్చిదిద్దాల్సింది.
చివరగా: మేము.. ఓ మంచి ప్రయత్నం.
రేటింగ్- 2.75/5