Begin typing your search above and press return to search.

భాగ్య‌రాజ్ కోసం దిగొచ్చిన పురుష సంఘం

By:  Tupaki Desk   |   4 Dec 2019 5:31 AM GMT
భాగ్య‌రాజ్ కోసం దిగొచ్చిన పురుష సంఘం
X
అమ్మాయిల‌ను టీజ్ చేస్తే షీటీమ్స్ లోనేస్తున్న సంగ‌తి తెలిసిందే. టీజ్ చేయ‌డం అంటే..? ఎలాంటి కామెంట్ చేసినా టీజ్ చేసిన‌ట్టే. ఇప్పుడు ఆ కేట‌గిరీలో బుక్క‌యిపోయాడో సీనియ‌ర్ డైరెక్ట‌ర్. అత‌డిని వెంట‌నే జైల్లో వేసి నాలుగు త‌న్నాల‌ని మ‌హిళా సంఘాలు అదే ప‌నిగా అగ్గి రాజేస్తుండడం హాట్ టాపిక్. ఈ ఎపిసోడ్ లో బుక్క‌యిన ఆ వెట‌ర‌న్ డైరెక్ట‌ర్ ఎవ‌రు? అంటే.. ది గ్రేట్ భాగ్య‌రాజా.

ఇటీవ‌ల ఓ ఆడియో వేడుక‌లో మ‌హిళ‌ల‌కు సంబంధించి త‌మిళ న‌టుడు.. ద‌ర్శ‌క‌ నిర్మాత భాగ్యరాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``మ‌హిళ‌లు జాగ్ర‌త్త‌గా ఉంటే ఎలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వ‌ని... త‌ప్పులు జ‌ర‌గ‌డానికి కొంత మంది మ‌హిళ‌లు కూడా ఓ కార‌ణం`` అని వ్యాఖ్యానించాడు. దీంతో గాయ‌ని చిన్మ‌యి స‌హా మ‌హిళా సంఘాలు ఒక్క‌ సారిగా భ‌గ్గుమ‌న్నాయి. వెంట‌నే భాగ్య‌రాజ్ పై చర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. ఆడ‌వారి గురించి అంత చుల‌క‌న‌గా మాట్లాతాడా? స‌్త్రీ శ‌క్తి అంటే ఏంటో ఆ పెద్ద‌మ‌నిషికి తెలియ‌దా? అంటూ శివ‌తాండ‌వ‌మాడారు కొంద‌రు. ఉన్న‌త స్థానంలో ఉండే వ్య‌క్తులు చేసే వ్యాఖ్య‌లు ఇలా ఉండ‌కూడ‌ద‌ని దుయ్య‌బ‌ట్టారు. తెలుగు రాష్ట్రానూ భాగ్య‌రాజ్ కు వ్య‌తిరేకంగా మ‌హిళా సంఘాలు గొంతు వినిపించాయి. దీంతో వివాదం ముదిరింది. భాగ్య‌రాజ్ వ‌ర్సెస్ మ‌హిళ‌లు అన్నంత గా సీన్ మారింది. ఎక్క‌డ చూసినా మ‌హిళా సంఘాల ప్ర‌తినిధులు భాగ్య‌రాజ్ పై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. భాగ్య‌రాజ్ ఒంట‌రి వాడైపోయి ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ఆయ‌న‌కు అండ‌గా త‌మిళ‌నాడు కు చెందిన పురుషుల సంఘం రంగంలోకి దిగింది. భాగ్య‌రాజ్ కు సంఘీభావం తెలుపుతూ ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది.

త‌మిళ‌నాడు పురుషుల సంఘం టైటిల్ ఆస‌క్తిక‌రం. `త‌మిళ‌నాడు ఆన్గ‌ల్ పాదుగాప్పు సంఘం` (అసోసియేష‌న్ ఫ‌ర్ ప్రొటెక్ష‌న్ ఆఫ్ మెన్) గా పిలుస్తారు. పురుష‌లంతా ఏక‌మై త‌మ హ‌క్కుల కోసం తాము పోరాడ‌తామ‌ని మ‌హిళా సంఘాల‌ను ఉద్దేశించి హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం వేడెక్కించింది. మ‌హిళ‌లకు దేశంలో ఎన్ని హ‌క్కులున్నాయో! ఓ మెట్టు త‌క్కువైనా స‌మాన హ‌క్కులు మాక్కూడా ఉన్నాయంటూ భాగ్య‌రాజ్ కు మ‌ద్ద‌తుగా వ్యాఖ‌లు చేసింది. అయిన దానికి కాని దానికి మ‌హిళా సంఘాలు రోడ్డెక్క‌డం ప‌ద్ద‌తిగా లేదంటూ హెచ్చ‌రించాయి. పురుషులు ఉన్న‌ది కేవ‌లం త‌మిళ‌నాడులోనేనా? ఆంధ్రా- తెలంగాణ‌ లో లేరా? అంటే.. ఇక్కడ‌ ఉన్న సంఘాలు స్పందిస్తేనే వారి యాక్టివిటీ ఏమిటో ఎవ‌రికైనా తెలిసొస్తుందేమో!!