Begin typing your search above and press return to search.

మగాళ్ళకి ఇన్ని కష్టాలా?… మెన్ టూ తో ఇంటరెస్టింగ్ గా

By:  Tupaki Desk   |   14 Feb 2023 9:31 AM GMT
మగాళ్ళకి ఇన్ని కష్టాలా?… మెన్ టూ తో ఇంటరెస్టింగ్ గా
X
ఈ మధ్యకాలంలో ఇంటరెస్టింగ్ కథలతో సినిమాలు వస్తున్నా సంగతి తెలిసిందే. యువ హీరోలు కొత్త కొత్త కథలని ప్రేక్షకులకి అందిస్తూ వినోదాన్ని ఇస్తున్నారు. ఇలా టాలెంటెడ్ యాక్టర్ గా డిఫరెంట్ కథలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్న హీరోగా నరేష్ అగస్త్య ఉన్నాడు. మత్తు వదలరా సినిమాతో హీరోగా మారిన నరేష్ అగస్త్య తరువాత సేనాపతి అనే సినిమాతో వరుస హిట్స్ కొట్టాడు. ఆ తర్వాత లావణ్య త్రిపాఠితో కలిసి హ్యాపీ బర్త్ డే అనే సినిమాలో నటించాడు.

ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు మెన్ టూ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నారు. దీనికి సంబందించిన టీజర్ ని హీరో శర్వానంద్ లాంచ్ చేశాడు.

ఇక ఈ మూవీ టీజర్ లో పెళ్ళైన, పెళ్లి కాని మగాళ్ళ కష్టాలని దర్శకుడు ఎలివేట్ చేయడం విశేషం. ఇంట్లో ఉప్పు నుంచి సొసైటీలో ఉద్యోగం వరకు అన్నింటా మగాడు ఎదుర్కొనే వేధింపులని ఫన్ అండ్ ఎంటర్టైనర్ గా టీజర్ లో చూపించరు.

ఆడవాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ సౌండ్ పొల్యూషన్ ఉంటుంది అని, అలాగే అన్ని తప్పులు వారే చేసి చివరికి బలి చేసేది మగాడిని అనే విధంగా మెన్ టూ మూవీ టీజర్ లో చూపించారు.

నిజానికి మగాళ్ళ కష్టాలని చాలా సినిమాలలో చూపించిన కూడా ఈ తరహాలో కంప్లీట్ గా ఆడవాళ్ళ నుంచి వారు ఎదుర్కొనే కష్టాలని ఫన్ మోడ్ లో చూపించడం మొదటి సారి అని చెప్పాలి. ఇలాంటి కథలని మంచి బజ్ వస్తుంది. ముఖ్యంగా యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ మూవీకి భాగా కనెక్ట్ అవుతారు.

అలాగే ఆడవాళ్ళు కూడా ఈ సినిమా కూడా కాస్తా వినోదాన్ని ఆశ్వాదిస్తారు. మొత్తానికి ఇంటరెస్టింగ్ స్టొరీ లైన్ తో నరేష్ అగస్త్య చేస్తున్న ఈ ప్రయత్నం వర్క్ అయ్యేలానే కనిపిస్తుంది. ఇక ఈ మూవీతో శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక బ్రహ్మాజీ, వైవా హర్ష మరో ఇంటరెస్టింగ్ రోల్స్ లో కనిపించారు. వీరి ముగ్గురు చుట్టూ వినోదం కావాల్సినంత ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.