Begin typing your search above and press return to search.
మూవీ టాక్ : మెర్క్యూరీ నిలిచిందా
By: Tupaki Desk | 14 April 2018 7:19 AM GMTప్రభుదేవా మొదటి సారి విలన్ గా నటించిన సైలెంట్ మూవీ మెర్క్యూరీ నిన్న విడుదలైంది. సైలెంట్ మూవీ కనక బాషలకు అతీతంగా విడుదల చేసారు. సుమారు ముప్పై ఏళ్ళ గ్యాప్ తర్వాత వచ్చిన మూకీ సినిమా కావడంతో దీని మీద ప్రేక్షకుల అంచనాలు ఓ మోస్తరుగా ఉన్నాయి. ఇక టాక్ విషయానికి వస్తే హారర్ థ్రిల్లర్ జానర్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళను సైతం మెర్క్యూరీ పూర్తిగా మెప్పించలేకపోయింది. ఒక మెర్క్యూరీ ఫ్యాక్టరీ వల్ల తనతో పాటు కుటుంబాన్ని కోల్పోయిన ప్రభుదేవా దానికి కారణం అయిన వాళ్ళ మీద ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు అనేదే ఇందులో కథ. ట్విస్ట్ ఏంటంటే దానికి కారణమైన నలుగురు కీలక పాత్రధారులకు చెవులు వినపడవు - ప్రతీకారం కోసం కాచుకుని ఉన్న ప్రభుదేవా ఆత్మకు కళ్ళు కనిపించవు. వీళ్ళ మధ్య జరిగే డ్రామానే మెర్క్యూరీ.
లైన్ చాలా కొత్తగా ఉన్నప్పటికీ దానికి కావలసినంత థ్రిల్ కలిగే స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఫెయిల్ అయ్యాడు. తమిళ్ సినిమాలో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగిన పిజ్జా-జిగర్ తాండా-ఇరైవి సినిమాలు తీసింది ఇతనేనా అని అనుమానం కలిగేలా ఉంది ఇందులో టేకింగ్ చూస్తే. ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రల పరిచయానికి వాడేసుకున్న సుబ్బారాజ్ సెకండ్ హాఫ్ లో అసలు కథను మొదలుపెట్టినా అది ఏమంత ఆసక్తికరంగా లేకపోవడంతో ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తాడు. దానికి తోడు మాటలు లేకపోవడంతో కేవలం సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీదే ఆధారపడవలసి వచ్చింది. కథ మొత్తం నిర్మానుషమైన ఒక ఫ్యాక్టరీ చుట్టే ఉండటం కూడా ఒకరకంగా మైనస్ గా మారింది. గత వారం విడుదలైన మరో సైలెంట్ మూవీ ఎ క్వాయిట్ ప్లేస్ తరహాలో సబ్ టైటిల్స్ ఉన్న కొంత బెటర్ గా ఉండేది కాని అది కూడా లేదు కనక ఎమోషనల్ గా చెప్పిన కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవడంతో ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డెడ్ లా మిగిలిపోయింది ఫలితం.