Begin typing your search above and press return to search.
మెరిసేలే లిరికల్ సాంగ్.. ప్లెజెంట్ ఫీల్ గుడ్ సాంగ్
By: Tupaki Desk | 5 Jun 2021 9:10 AM GMTమంచి సాహిత్యం.. దానికి తగ్గట్టు ట్యూన్ .. మధురంగా ఆలపించే గొంతు సమకుదిరితే ఆ పాట శ్రోతల్ని పదే పదే మైమరిచిపోయేలా చేస్తుంది. ఆ కోవలోనే ఎంతో ఆహ్లాదంగా చక్కని సాహిత్యం గానంతో అలరిస్తోంది మెరిసేనులే సాంగ్.
`అర్థశతాబ్ధం` చిత్రంలోనిది ఈ పాట. ముఖ్యంగా శంకర్ మహదేవన్ గానం పాటకు ప్రత్యేక వన్నె తెచ్చింది. నవ్ ఫల్ రాజా సంగీతం రహమాన్ లిరిక్ ఆకట్టుకున్నాయి. కేరాఫ్ కంచెరపాలెం ఫేం కార్తీక్ రత్నం- కృష్ణ ప్రియ నాయకానాయికలుగా నవీన్‌చంద్ర కీలక పాత్రలో నటించిన ఈ సినిమా టీజర్ ని ఇంతకుముందు సుకుమార్ లాంచ్ చేయగా ఆకట్టుకుంది. న్యాయం ధర్మం అవుతుంది… కానీ ధర్మం ఎప్పుడూ న్యాయం కాదు.. ధర్మయుద్ధాలు.. స్వతంత్య్ర దేశాలు అంటూ పదునైన డైలాగులతో ఆసక్తిని పెంచింది. ప్రేమ.. పగ.. ప్రతీకారం కాన్సెప్టుతో ఈ సినిమా మరో లెవల్లో ఉండనుందన్న టాక్ కూడా వినిపిస్తోంది.
రవీంద్ర పుల్లె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సాయికుమార్- ఆమని- శుభలేక సుధాకర్- సుహాస్ తదితరులు తారాగణం. పాటలతో టీజర్ తో కంటెంట్ తో ఆకర్షిస్తున్న ఈ చిత్రం జూన్ 11న ఆహాలో రిలీజ్ కానుంది.