Begin typing your search above and press return to search.

ఈ పేరు గట్టిగా వినపడుతుంది..!

By:  Tupaki Desk   |   30 Oct 2022 4:15 AM GMT
ఈ పేరు గట్టిగా వినపడుతుంది..!
X
మేర్లపాక గాంధి, సంతోశ్ శోభన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా లైక్ షేర్ & సబ్ స్క్రైబ్. నిహారిక ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో వెంకట్ బోయినపల్లి ఈ మూవీ నిర్మించారు. సినిమాలో సంతోశ్ కి జోడీగా ఫరియా అబ్ధుల్లా నటించారు. నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. ఈవెంట్ కి గెస్టులుగా న్యాచురల్ స్టార్ నాని, డైరక్టర్ మారుతి వచ్చారు.

ఈవెంట్ లో భాగంగా డైరక్టర్ మేర్లపాక గాంధి హీరో సంతోశ్ శోభన్ గురించి క్రేజీగా మాట్లాడారు. లైక్ షేర్ & సబ్ స్క్రైబ్ కథ సంతోశ్ శోభన్ కోసమే పుట్టింది. డార్లింగ్ కి చాలా థ్యాంక్స్. సంతోశ్ శోభన్ పేరు ఒకటి రెండు సినిమాలతో ఆగిపోయేది కాదు లైఫ్ లాంగ్ గట్టిగా ఈ పేరు వినపడుతుందని అన్నారు. జాతిరత్నాలు హిట్ తర్వాత ఫరియా అబ్ధుల్లా ఈ సినిమా చేసింది. మంచి మనసున్న హీరోయిన్ ఆమె. చాలా మంచి అమ్మాయని అన్నారు మేర్లపాక గాంధి. ఇక తన సినిమాలో బ్రహ్మాజికి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన పాత్ర ఇస్తూ వచ్చిన గాంధి ఈ సినిమలో బ్రహ్మాజికి బ్రహ్మన్నగా ఈ సినిమాలో ఆయన నట విశ్వరూపం చూస్తారని అన్నారు డైరక్టర్.

సినిమాలో నటించిన మిగతా నటీనటులకు థ్యాంక్స్ చెప్పారు. టెక్నిషియన్స్ సపోర్ట్ కూడా చాలా బాగుందని. సినిమా కోసం పనిచేసిన వారందరికి థ్యాంక్స్ చెప్పారు మేర్లపాక గాంధి. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఇచ్చిన గోరేటి వెంకన్న గారికి థ్యాంక్స్ చెప్పారు మేర్లపాక గాంధి. సినిమా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుందని తప్పకుండా థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని అన్నారు డైరక్టర్ మేర్లపాక గాంధి. కెరియర్ మొదట్లోనే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో హిట్లు అందుకున్న మేర్లపాక గాంధి ఈమధ్య తన జోరు తగ్గించారు. లైక్ షేర్ & సబ్ స్క్రైబ్ సినిమాతో మరోసారి తన కాండీ సత్తా చాటనున్నారు దర్శకుడు. ఈ మూవీ అనుకున్న రేంజ్ సక్సెస్ అయితే మేర్లపాక గాంధి మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చినట్టే. మేర్లపాక గాంధి చెప్పాడనే కాదు హీరోగా డిఫరెంట్ స్టోరీస్ తో ప్రయోగాలు చేస్తూ క్రేజ్ తెచ్చుకుంటున్నాడు సంతోశ్ శోభన్. ఏక్ మిని కథతో మొదటి హిట్ అందుకున్న అతను లైక్ షేర్ & సబ్ స్క్రైబ్ మూవీతో మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు ఈ యువ హీరో.